Kaizer News

బీజేపీ అంతర్గత సర్వే-జెన్ జీతో తెగిన బంధం..! మోడీ

బీజేపీ అంతర్గత సర్వే-జెన్ జీతో తెగిన బంధం..! మోడీ కేబినెట్ ప్రక్షాళనకు బ్రేక్ ?

· National - India · telugu.oneindia.com

కేంద్ర కేబినెట్ ప్రక్షాళనపై (Modi Cabinet Reshuffle) గత కొన్ని నెలలుగా చర్చ జరుగుతూనే ఉంది. కానీ ముందడుగు మాత్రం పడటం లేదు. దీని వెనుక చాలా కారణాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా జెన్ జీ నిరసనల తర్వాత దేశంలో మారిన పరిస్ధితులు ప్రధాని మోడీని కేబినెట్ ప్రక్షాళనపై తీవ్ర నిర్ణయాలు తీసుకోలేని పరిస్ధితి కల్పిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా బీజేపీ నిర్వహించిన అంతర్గత సర్వేలో కీలక విషయాలు బయటపడినట్లు తెలుస్తోంది. వాటి తర్వాతే కేబినెట్ ప్రక్షాళనపై ప్రధాని మోడీ పునరాలోచనలో పడినట్లు సమాచారం. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముందే కేబినెట్ ప్రక్షాళన చేయాలనుకున్న ప్రధాని మోడీ.. అప్పట్లో బిజీ షెడ్యూల్ కారణంగా ఆలస్యం చేశారు. అయితే అనూహ్యంగా పార్లమెంట్ సమావేశాల సమయంలోనే జెన్ జీ నిరసనలు మొదలు కావడం, అవి తీవ్ర రూపం దాల్చి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు దారి తీయడం, దీంతో పాటే యువతలో బీజేపీపై పెరుగుతున్న అసహనం వంటి కారణాలతో కేబినెట్ మార్పులు ప్రధాని మోడీకి సవాల్ గా మారిపోయాయి. .! కేబినెట్ ప్రక్షాళన ఆలస్యం వెనుక? అయితే తాజాగా కేబినెట్ ప్రక్షాళనకు అడుగులు వేసే ముందు ఎంపీల పనితీరుపై బీజేపీ అంతర్గత సర్వే చేయించినట్లు తెలుస్తోంది. రహస్యంగా నిర్వహించిన ఈ సర్వేలో భారీ పరిపాలనాపరమైన జాప్యాలు, వివిధ నియోజకవర్గాల్లో బీజేపీ పట్ల పెరుగుతున్న ప్రజా వ్యతిరేకత బయటపడ్డాయని సమాచారం. కాక్రోచ్ ల నిరసనలు ఈ ఆందోళనకరమైన అంశాలను మరింతగా ధృవీకరించాయి. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య ఉన్న స్పష్టమైన అంతరాన్ని ఇవి బయటపెట్టాయి. వీటన్నింటి కంటే ముఖ్యంగా బీజేపీకి చెందిన ప్రస్తుత ఎంపీలలో అత్యధికులు తమ సొంత పనితీరు లేదా స్థానిక ప్రజాదరణ వల్ల కాకుండా, కేవలం ప్రధాని మోదీ వ్యక్తిగత ఆకర్షణ వల్లే తమ సీట్లను నిలబెట్టుకుంటున్నారని ఈ సర్వే తేల్చింది. Recommended For You Modi Cabinet Reshuffle: మోడీ కేబినెట్ ప్రక్షాళనకు తాజా ముహుర్తం..! ఆర్ధికమంత్రిగా ఊహించని వ్యక్తి..! మోడీ బ్రాండ్‌పై ఇలా అతిగా ఆధారపడటంలోని ప్రమాదాలను గ్రహించిన పార్టీ నాయకత్వం, గతంలో కేబినెట్ ప్రక్షాళన కోసం చేసిన ప్రణాళికలను ఆపేసినట్లు తెలుస్తోంది. మొత్తం పరిస్థితిని పునఃపరిశీలించడానికి ఒక కొత్త పరిశీలన బృందాన్ని కూడా నియమించింది. మరింత బలమైన, సమర్థవంతమైన మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసేందుకు, ఈ బృందం మొదటి నుండి ఈ కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఇది పూర్తయితే కానీ మోడీ కేబినెట్ విస్తరణ లేదా ప్రక్షాళన చేపట్టే అవకాశం లేదని సమాచారం

Original source: telugu.oneindia.com
Read more on Kaizer News