Kaizer News

Telangana: తెలంగాణలోని రైతులకు ప్రభుత్వం అలర్ట్..

Telangana: తెలంగాణలోని రైతులకు ప్రభుత్వం అలర్ట్.. ఈ నెల 30 వరకు ఛాన్స్.. మిస్ కావొద్దు..

· State - Telangana · tv9telugu.com

రైతులకు తెలంగాణ ప్రభుత్వం బిగ్ అలర్ట్ జారీ చేసింది. రైతు రిజిస్ట్రేషన్(ఫార్మర్ రిజిస్ట్రీ) తప్పనిసరిగా చేసుకోవాలని సూచించింది. ఒకే రైతు-ఒకే గుర్తింపు-సమగ్ర సేవలు కోసం కేంద్ర ప్రభుత్వం ఫార్మర్ రిజిస్ట్రీని ప్రవేశపెట్టింది. ఈ విధానంలో రైతులకు ఒక యూనిక్ ఐడీ కేటాయిస్తారు. ఈ ఐడీ ద్వారా రైతులు ప్రభుత్వ పథకాలు, సబ్సిడీలు, రాయితీలు పొందవచ్చు. ప్రతీఒక్క రైతులు ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదు చేసుకుని ఐడీ పొందాలి. రైతులను సులువుగా గుర్తించేందుకు ఇది సహాయపడుతుంది. నిజమైన రైతులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించేందుకు ఉపయోగపది. కేవలం ఆధార్, పట్టాదారు పాస్ బుక్, మొబైల్ నెంబర్ ఉంటే రిజిస్టర్ చేసుకోవచ్చు. ఈ ప్రక్రియ ఎలా అనేది చూద్దాం. ఫార్మర్ రిజిస్ట్రీలో సులువుగా రైతులు నమోదు చేసుకుని ఐడీ పొందవచ్చు. సెప్టెంబర్ 22వ తేదీ నుంచి 30వ తేదీ వరకు తొమ్మది రోజుల పాటు గ్రామాల్లో రైతు రిజిస్ట్రేషన్ కోసం ప్రత్యేక క్యాంపెయిన్లు తెలంగాణ ప్రభుత్వ నిర్వహిస్తోంది. దీంతో మీ గ్రామాల్లోకి అధికారులు వచ్చి రిజిస్ట్రర్ చేస్తారు. వారి దగ్గర మీరు ఈ ప్రక్రియ పూర్తి చేయవచ్చు. ఇక మండల పరిధిలోని వ్యవసాయ విస్తరణ అధికారి(AEO) వద్ద లేదా మీ సేవలో నమోదు చేసుకోవచ్చని రేవంత్ సర్కార్ స్పష్టం చేసింది. ఇప్పటికే నమోదు చేసుకున్నవారు మళ్లీ చేసుకోవాల్సిన అవసరం లేదు. రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఐడీ నెంబర్‌ను గుర్తు పెట్టుకోండి. పీఎం కిసాన్, రైతు భరోసా వంటి పథకాలు పొందేందుకు ఇది తప్పనిసరిగా అవసరం. ఫార్మర్ రిజిస్ట్రేషన్ కోసం ఆధార్ కార్డు, భూమి పాస్ బుక్, ఆధార్‌కు లింక్ అయిన మొబైల్ నెంబర్ అవసరం. -కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన సంక్షేమ పథకాలు, సేవలు, ఇతర ప్రయోజనాలు పొందేందుకు అవసరం -రాయితీలు, సబ్సిడీలు, ఇతర సేవల కోసం ఉపయోగపడుతుంది -బ్యాంకుల ద్వారా పంట రుణాలు పొందేందుకు సహాయపడుతుంది -ఫ్రేమ్ వర్క్ ఫర్ ఫెర్టిలైజర్ యాప్ ద్వారా ఎరువుల బుకింగ్ కోసం అవసరం -వరి, పత్తి, మొక్కజొన్న, కంది వంటి వంటలకు కనీస మద్దతు ధర పొందేందుకు ఉపయోగపడుతుంది -https://tlfr.agristack.gov.in/farmer-registry-tl/#/checkEnrolmentStatus లింక్ తెరవండి -ఆధార్ నెంబర్ ఆప్షన్ ఎంచుకోండి మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి -ఆధార్‌తో లింక్ అయిన మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీ ఎంటర్ చేయండి -అనంతరం సబ్మిట్ చేస్తే మీ ఐడీ నెంబర్ స్క్రీన్‌పై కనిపిస్తుంది

Original source: tv9telugu.com
Read more on Kaizer News