Kaizer News

Kothapeta: రావులపాలెంలో మీడియాతో మాట్లాడిన కొత్తపే

Kothapeta: రావులపాలెంలో మీడియాతో మాట్లాడిన కొత్తపేట ఎమ్మెల్యే!

· State - Telangana · hmtvlive.com

Shorts Kothapeta: పాలనలో చంద్రబాబు దూరదృష్టం ఆలోచిస్తారని, జగన్ మోహన్ రెడ్డి వక్రబుద్ధితో ప్రతిదీ రాజకీయం చేస్తారని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు విమర్శించారు. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, ఎల్‌నినో ప్రభావంతో సాగునీటి ఇబ్బందులు ఏర్పడుతున్న నేపథ్యంలో వైసీపీ నాయకులు ప్రతి సమస్యను చంద్రబాబు నాయుడుకు ఆపాదించడం సరికాదని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. రావులపాలెం క్యాంప్ కార్యాలయం వద్ద జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు ముందుచూపుతో చేపట్టిన పట్టిసీమ, పురుషోత్తపట్నం, వెలిగొండ వంటి సాగునీటి ప్రాజెక్టులు నేడు రైతులకు, ప్రజలకు ఉపయోగపడుతున్నాయని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం రైతుల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే బండారు తెలిపారు. కరువు పరిస్థితులను శాస్త్రీయంగా అంచనా వేసి, అవసరమైన చర్యలు చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందన్నారు. రాష్ట్రంలో కరువు ప్రభావిత మండలాల గుర్తింపు, రైతులకు భరోసా కల్పించడం, సాగు–తాగునీటి సమస్యలను ఎదుర్కొనేందుకు చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. రాష్ట్రంలో యూరియా కొరత ఉందంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలపై ఎమ్మెల్యే బండారు స్పందిస్తూ.. రైతులు అవసరానికి అనుగుణంగా ఎరువులు వినియోగించేలా ప్రభుత్వం సూచనలు చేస్తోందని తెలిపారు. ఎక్కడైనా సరఫరా సమస్యలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. గతంలో కాలువల నిర్వహణపై నిర్లక్ష్యం జరిగిందని ఆరోపించిన ఎమ్మెల్యే బండారు.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో నియోజవర్గంలో ఉచ్చిలి, వసంతవాడ, పేరవరం లిఫ్ట్ ఇరిగేషన్ లు, కాలువల పరిస్థితిపై పరిశీలనలు నిర్వహించి, అవసరమైన చోట మరమ్మతులు చేపడుతోందన్నారు. అమలాపురం పరిధిలో కాలువల సమస్యలపై అధికారులు, కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకున్న సందర్భాలు ఉన్నాయని తెలిపారు. భూ రికార్డుల్లో గతంలో ఏర్పడిన సమస్యలను పరిష్కరించేందుకు రీసర్వే, రెవెన్యూ రికార్డుల సవరణపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని ఎమ్మెల్యే బండారు అన్నారు. QR కోడ్, రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్‌బుక్స్‌ను అందించడం జరుగుతోందని తెలిపారు. భూ సమస్యలకు పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన అనంతరం త్వరితగతిన చెల్లింపులు జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. గతంలో రైతులు చెల్లింపుల కోసం ఎదురుచూసిన పరిస్థితులు ఉండేవని ఆరోపించిన ఆయన.. ప్రస్తుతం రైతులకు సమయానుకూలంగా చెల్లింపులు అందేలా వ్యవస్థను బలోపేతం చేశామని పేర్కొన్నారు. ఎల్‌నినో ప్రభావం, అంతర్జాతీయ పరిస్థితుల కారణంగా కొన్ని నిత్యావసర వస్తువుల ధరల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయని ఎమ్మెల్యే బండారు అన్నారు. బియ్యం, ఉల్లిపాయలు తదితర వస్తువులను అందుబాటు ధరల్లో ప్రజలకు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని తెలిపారు. ఎంఆర్పీ కంటే అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నారనే ఫిర్యాదులు తన దృష్టికి వచ్చాయని ఎమ్మెల్యే బండారు తెలిపారు. ఈ విషయంపై అధికారులతో మాట్లాడి, ఎక్కడైనా ఎంఆర్పీకి మించి విక్రయాలు జరి

Original source: hmtvlive.com
Read more on Kaizer News