Kaizer News

Mamidikuduru: ఆదుర్రు వరసిద్ధి వినాయకుడికి 108 ప్ర

Mamidikuduru: ఆదుర్రు వరసిద్ధి వినాయకుడికి 108 ప్రసాదాల మహా నివేదన!

· State - Telangana · hmtvlive.com

Shorts Mamidikuduru: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని లోక కళ్యాణం, గ్రామ శ్రేయస్సు, విశ్వశాంతిని కాంక్షిస్తూ డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా, మామిడికుదురు మండలం, ఆదుర్రు గ్రామంలోని రావిచెట్టు సెంటర్‌లో కొలువుదీరిన శ్రీవరసిద్ధి వినాయక స్వామివారికి శుక్రవారం రాత్రి ఘనంగా మహా నివేదన సమర్పించారు. వినాయక మండపం వద్ద భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి, స్వామివారికి 108 రకాల ప్రసాదాలను మహా నివేదనగా సమర్పించారు. ఈ కార్యక్రమానికి గ్రామస్థులు, భక్తులు విశేష సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకుల నుంచి వేద ఆశీర్వచనం అందుకున్నారు. వినాయకుని కృపతో గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, గ్రామంలో సౌభాగ్యం, శాంతి నెలకొనాలని భక్తులు ప్రార్థించారు. భక్తుల రాకతో రావిచెట్టు సెంటర్ పరిసర ప్రాంతాలు సందడిగా మారాయి. పూజా కార్యక్రమాలతో ఆదుర్రు గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది

Original source: hmtvlive.com
Read more on Kaizer News