Kaizer News

వివాహితపై జనసేన నేత దాష్టీకం

వివాహితపై జనసేన నేత దాష్టీకం

· State - Telangana · sakshi.com

పవన్‌ కళ్యాణ్‌ పుట్టినరోజు సందర్భంగా మైలవరం ఏఎంసీ చైర్మన్‌ నవ్యశ్రీతో కలిసి కేకును కట్‌ చేస్తున్న ఎడ్ల సుధాకర్‌ (ఫైల్‌) మైలవరం: తనతో అసభ్యంగా ప్రవర్తించి, అసభ్య పదజాలంతో దూషిస్తూ చంపేస్తానంటూ బెదిరించిన జనసేన నేతపై ఎలాంటి చర్యలు తీసుకోలేదంటూ ఓ మహిళ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ఎన్టీఆర్‌ జిల్లా మైలవరం మండలం కొత్తగూ­డెంలో జరిగిన ఘటనకు సంబంధించి బాధిత మహిళ తెలిపిన సమాచారం మేరకు.. గ్రామా­నికి చెందిన మహిళను పొరుగున ఉన్న బాడవ గ్రామానికి చెందిన జనసేన నేత ఎడ్ల సుధాకర్‌ వేధిస్తూ, లొంగదీసుకునేందుకు ప్రయత్నిస్తు­న్నాడు. ఈ విషయాన్ని బాధితురాలు కుటుంబ సభ్యులకు తెలపగా పెద్దల సమక్షంలో పంచాయితీ చేసి జనసేన నేతను మందలించారు. అయినా తీరు మార్చుకోని సుధాకర్, సదరు వివాహితతో ఫోన్లో మాట్లాడేందుకు ఇద్దరు వ్యక్తులను శుక్రవారం ఆమె వద్దకు పంపాడు. ఆమె మాట్లాడేందుకు నిరాకరించడంతో సుధా­కర్‌ వివాహిత వద్దకు వచ్చి అసభ్యంగా ప్రవ­ర్తించి, ఆమెపై దాడి చేశాడు. బాధిత మహి­ళను, ఆమె భర్తను కూడా చంపేస్తానంటూ బెదిరిస్తూ, అసభ్య పదజాలంతో దూషించా­డు. తనపై జరిగిన దాడిని కుటుంబీకులకు తెలిపిన బాధిత మహిళ, వారితో కలిసి మైల­వరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో జనసేన నేతతో పాటు అతడికి సహకరించిన మరో ఇద్దరిని శుక్రవారం స్టేషన్‌కు పిలిపించిన పోలీసులు, కేసు నమోదు చేసి వెంటనే విడుదల చేశారు. దాడి ఘటన సీసీ కెమెరాల్లో రికార్డయి, ప్రత్యక్ష ఆధారాలు ఉన్నప్పటికీ పోలీసులు ఈ ఘటనపై నిర్లక్ష్యంగా వ్యవహ­రించడం చర్చనీయాంశమైంది. బ్లాక్‌ డ్రెస్‌లో మరింత బ్యూటిఫుల్‌గా మృణాల్‌ ఠాకూర్‌ (ఫోటోలు) నెల్లూరులో భారీ వర్షం... నీట మునిగిన రోడ్లు (ఫొటోలు) తిరుమల : మోహినీ అవతారంలో శ్రీవారు.. మార్మోగుతున్న గోవింద నామస్మరణ (ఫొటోలు) సైమా అవార్డ్స్ 2026 వేడుకలో ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ (ఫొటోలు) ముంబై : వినాయక చవితి వేడుకల్లో బాలీవుడ్‌ జంట సందడి (ఫొటోలు) నన్నే భయపెట్టాలని చూస్తావా.. గుర్తుపెట్టుకో పెమ్మసాని లోన్ తీసుకునేవారికి RBI షాక్.. పెరగనున్న EMI భారం నీళ్లు లేని చెరువుల్లో గణేష్ నిమజ్జనాలు.. అసలేం జరిగిందంటే!

Original source: sakshi.com
Read more on Kaizer News