Kaizer News

పాలేరు జలాశయానికి సాగర్ జలాలు.. నాలుగు జిల్లాలకు న

పాలేరు జలాశయానికి సాగర్ జలాలు.. నాలుగు జిల్లాలకు నీటి కొరత తీరుతుంది

· State - Telangana · v6velugu.com

కూసుమంచి, వెలుగు: ఖమ్మం, సూర్యాపేట, వరంగల్, మహబూబాబాద్​ జిల్లా ప్రజల తాగునీటి అవసరాలు తీర్చేందుకు నాగార్జున సాగర్ నుంచి పాలేరు జలాశయానికి నీటిని విడుదల చేసినట్లు ఇరిగేషన్ ఎస్ఈ మంగళపూడి వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రస్తుతం పాలేరు రిజర్వాయర్ లో 15.90 నీటిమట్టం ఉందని, పూర్తి స్థాయి నీటిమట్టం 23 అడుగుల వరకు నింపనున్నట్లు చెప్పారు. సాగర్ నుంచి 5 వేల క్యూసెక్కులు విడుదల చేయగా, దేవులపల్లి నుంచి ప్రస్తుతం 2,200 క్యూసెక్యులు పాలేరు జలాయానికి చేరుతోంది. ఈ నీటిని తాగునీటి కోసం పొదుపుగా వాడుకోవాలని సూచించారు. కాలువల ఔట్​ఫాల్, ఇన్​ ఫాల్​ గేట్ల లీకేజీలు, ఇతర లీకేజీలు లేకుండా చర్యలు చేపట్టామని తెలిపారు. వర్షభావ పరిస్థితుల కారణంగా కేవలం తాగునీటి కోసమే నీటిని నింపుతున్నట్లు చెప్పారు. అంతకుముందు సాగర్​ ఎడమ కాలువ, సాగర్​ ఇన్​ఫ్లో, లైనింగ్​ పనులను పరిశీలించారు. 2024 వరదల్లో యూటీ, కెనాల్​ లైనింగ్​ కొట్టుకుపోగా, యూటీ నిర్మాణం పూర్తి అయ్యాయని, లైనింగ్​ పనులు రూ.8 కోట్లతో ప్రారంభమయ్యాయని తెలిపారు

Original source: v6velugu.com
Read more on Kaizer News