Kaizer News

India-Japan | తేజ‌స్ యుద్ధ‌ విమానంలో ప్ర‌యాణించిన

India-Japan | తేజ‌స్ యుద్ధ‌ విమానంలో ప్ర‌యాణించిన జ‌పాన్ ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌..!

· National - India · ntnews.com

India-Japan : భారత్ (India) కు చెందిన తేలికపాటి యుద్ధవిమానం తేజస్‌ (Tejas) లో జపాన్‌ (Japan) ఎయిర్ సెల్ఫ్‌ డిఫెన్స్‌ ఫోర్స్‌ అధిపతి (Japan Airforce chief) జనరల్‌ టకెహిరో మొరిటా (Takehiro Morita) ప్రయాణించారు. ఆయనతోపాటు భారత వాయుసేన చీఫ్‌ (Indian Airforce Chief) అమర్‌ ప్రీత్‌ సింగ్‌ (Amarpreet Singh) కూడా తేజస్‌లో ప్రయాణించారు. ఆదివారం ఉదయం భారత్‌-జపాన్‌ (India-Japan) ద్వైపాక్షిక వాయుసేన సంయుక్త విన్యాసాలు వీర్‌ గార్డియన్‌-2026లో భాగంగా జోధ్‌పుర్‌ ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌ నుంచి వీటిని నిర్వహించారు. తొలుత వాయుసేన స్థావరానికి వచ్చిన వీరు తమకు కేటాయించిన తేజస్‌ విమానాల వద్దకు చేరుకొన్నారు. భారత పైలట్‌తో కలిసి జపాన్‌ వాయుసేన అధిపతి విమానం నడపగా.. ఐఏఎఫ్‌ చీఫ్‌ స్వయంగా మరో తేజస్‌ విమానాన్ని నడిపారు. ఈ విన్యాసాల్లో భారత్‌-జపాన్‌ యుద్ధ వ్యూహాలను కూడా పంచుకొన్నాయి. ఈ విన్యాసాల్లో భారత్‌ సుఖోయ్‌-30 ఎంకేఐ, రఫేల్‌ ఫైటర్‌జెట్‌, ఎల్‌సీఏ తేజస్‌ విమానాలు భారత్‌ నుంచి పాల్గొనగా.. జేఏఎస్‌డీఎఫ్‌ నుంచి ఎఫ్‌-2ఏ ఫైటర్‌ జెట్‌ పాల్గొన్న‌ది

Original source: ntnews.com
Read more on Kaizer News