దర్శకుడు పా.రంజిత్ తనదైన విజన్‌తో తెరకెక్కించిన ‘వేట్టువం’ సినిమా ప్రస్తుతం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారుతోంది. ఆర్య, శోభిత ధూళిపాళ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ.. కథ, పాత్రల డిజైన్, మేకింగ్, విజువల్స్‌తో ప్రేక్షకులను సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తోంది. సాధారణ కమర్షియల్ ఫార్ములాకు దూరంగా.. ప్రతి పాత్రకు ఓ బలమైన నేపథ్యాన్ని, ఓ సంఘర్షణను జోడిస్తూ పా.రంజిత్ కథను నడిపించిన తీరు ప్రశంసలు అందుకుంటోంది. ముఖ్యంగా సినిమాలోని పాత్రల ఎమోషన్స్, వారి ప్రయాణం, కథలోని సంఘర్షణ సినిమాకు మెయిన్ ప్లస్‌గా నిలుస్తున్నాయని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో శోభిత మామ, టాలీవుడ్ కింగ్ నాగార్జున ‘వేట్టువం’పై తన స్పందనను సోషల్ మీడియాలో పంచుకున్నారు. సినిమా విజువల్స్, పా.రంజిత్ క్రియేట్ చేసిన వరల్డ్ తనను ఆకట్టుకున్నాయని చెబుతూ.. శోభిత కష్టాన్ని కూడా ప్రత్యేకంగా ప్రశంసించారు. ముఖ్యంగా మల్లఖంబ క్రీడలో శిక్షణ తీసుకోవడం, ఆ పాత్రకు తగ్గట్టుగా తనను తాను మలుచుకోవడం కోసం శోభిత పడిన కష్టం తెరపై స్పష్టంగా కనిపిస్తోందని నాగ్ అభినందించారు. “వావ్.. ఈ వెట్టువం వరల్డ్ బిల్డింగ్ నాకు వీపరీతంగా నచ్చింది!! శోభితా.. నువ్వు ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డట్టుగా విజువల్స్ చూస్తే అర్ధమవుతుంది. నీ కష్టం.. నీ ఫ్యాషన్ ని తెరపై చూడటం కోసం ఎదురుచూస్తున్నా!!” అని నాగ్ ట్వీట్ చేశాడు. నాగ్ చేసిన ఈ కామెంట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. ముఖ్యంగా ‘Looks like you put in a lot of work Sobhita’ అంటూ శోభిత పెట్టిన ఎఫర్ట్‌ను ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించడం ఆసక్తిని పెంచుతోంది. దీంతో ‘రాధి’ పాత్ర కోసం శోభిత ఎంతగా శ్రమించిందో మరోసారి చర్చకు వచ్చింది. ఇక ‘వేట్టువం’లో ప్రతి పాత్ర వెనుక ఓ సంఘర్షణ, ప్రతి కథలో ఓ బలమైన ఎమోషన్ ఉండేలా పా.రంజిత్ కథను డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. కథలోని పాత్రలను మాత్రమే కాదు.. వాటి చుట్టూ ఓ ప్రత్యేకమైన ప్రపంచాన్ని నిర్మించిన తీరు సినిమాకు మెయిన్ హైలైట్‌గా నిలుస్తోంది. మరోవైపు పా.రంజిత్ మేకింగ్, విజువల్స్, కథను ప్రజెంట్ చేసిన విధానంపై కూడా ప్రశంసలు వస్తున్నాయి. ఆర్య–శోభిత కాంబినేషన్, పా.రంజిత్ యూనిక్ వరల్డ్, శోభిత మల్లఖంబ ట్రైనింగ్.. ఇవన్నీ కలిసి ‘వేట్టువం’పై క్యూరియాసిటీని మరింత పెంచుతున్నాయి. మొత్తానికి నాగార్జున ప్రశంసలతో ‘వేట్టువం’పై మరింత హైప్ క్రియేట్ అవుతోంది. మరి పా.రంజిత్ సృష్టించిన ఈ కొత్త ప్రపంచం వెండితెరపై ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో చూడాలి