ముంబై: గణపతి నిమజ్జనం భక్తులకు భావోద్వేగంతో కూడిన సందర్భం. గణపయ్యకు వీడ్కోలు పలికే సమయంలో నటుడు, కేంద్ర మంత్రి, లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) నేత చిరాగ్ పాశ్వాన్ భావోద్వేగానికి గురైన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. విగ్రహాన్ని నిమజ్జనానికి తరలిస్తున్న సమయంలో ఆయన కన్నీళ్లు తుడుచుకుంటూ కనిపించారు. గణపతి విగ్రహాన్ని నిమజ్జనానికి తీసుకెళ్తున్న సమయంలో చిరాగ్ పాశ్వాన్ అక్కడే ఉన్నారు. వీడ్కోలు పలుకుతున్న సమయంలో ఆయన తన భావోద్వేగాలను నియంత్రించుకోలేకపోయినట్లు వీడియోలో కనిపించింది. చుట్టూ ఉన్న భక్తులు నిమజ్జన కార్యక్రమంలో పాల్గొంటుండగా.. చిరాగ్ పాశ్వాన్ కన్నీళ్లు తుడుచుకుంటూ కనిపించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోను చూసిన కొంతమంది సోషల్ మీడియా యూజర్స్ చిరాగ్ పాశ్వాన్ కన్నీళ్లు నిజమైనవేనా అంటూ ప్రశ్నించారు. మరికొందరు ఆయన నటిస్తున్నారని వ్యాఖ్యానించారు. చిరాగ్ పాశ్వాన్‌వి ‘నకిలీ కన్నీళ్లు’ అంటూ ఒకరు వ్యాఖ్యానించగా.. మరొకరు ‘గొప్ప నటుడు’ అంటూ వ్యంగ్యంగా స్పందించారు. ఇంకొందరు ఆయన నవ్వుతూ ఏడుస్తున్నట్లు నటిస్తున్నారని, ఇదంతా ఫేక్ అంటూ కామెంట్లు చేశారు. ఇదీ చదవండి: పారిస్ ఒప్పందాన్ని నిలబెట్టాం : ప్రధాని మోదీ సైమా అవార్డ్స్ 2026 వేడుకలో ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ (ఫొటోలు) ముంబై : వినాయక చవితి వేడుకల్లో బాలీవుడ్ జంట సందడి (ఫొటోలు) మార్కెట్లోకి ఐఫోన్ 18 ఎంట్రీ...స్టోర్స్ ముందు క్యూ కట్టిన ఫ్యాన్స్ (ఫొటోలు) బిగ్ బాస్ బ్యూటీ తనూజ ‘హతః’ సినిమా టీజర్ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు) ఖైరతాబాద్ మహా గణపతి...ట్యాంక్ బండ్‌పై సందడిగా నిమజ్జనం (ఫొటోలు) కమలమ్మ పార్థివ దేహనికి విజయమ్మ, అవినాష్ రెడ్డి నివాళులు బుడ్డోడికి షాక్ ఇచ్చిన గంభీర్.. అప్పటివరకు టీంలో నో ప్లేస్ బంగారంపై AI ఎఫెక్ట్.. 10 గ్రాములు రూ.3 లక్షలు?