Indian Railways: రాబోయే దసరా పండుగను పురస్కరించుకుని ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు దక్షిణ మధ్య రైల్వే (SCR) ప్రత్యేక చర్యలు చేపట్టింది. తెలంగాణలోని చర్లపల్లి నుండి తమిళనాడులోని నాగర్‌కోయిల్ మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇది ప్రతి ఆదివారం నడుస్తుంది. తేదీలు: సెప్టెంబర్ 27, 2026 నుండి అక్టోబర్ 25, 2026 వరకు నడుస్తుంది. అయితే మొత్తం 5 ట్రిప్పులు నడుస్తుంది. ఈ పండుగ ప్రత్యేక రైళ్లలో 2nd AC (AC II Tier), 3rd AC (AC III Tier), స్లీపర్ క్లాస్ (Sleeper Class), జనరల్ సెకండ్ క్లాస్ (General Second Class) కోచ్‌లను అందుబాటులో ఉంచారు.పండుగ వేళల్లో స్వగ్రామాలకు, పర్యాటక ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ఈ ప్రత్యేక రైలు సర్వీసులను వినియోగించుకోవాలని రైల్వే శాఖ సూచించింది