Nellore: సోమశిల,కండలేరు జలాశయాల్లో నీటి నిర్వహణ పై ప్రభుత్వం చిత్తశుద్ధితో లేదని తీవ్ర విమర్శలు చేశారు రాష్ట్ర మాజీ మంత్రి, వైసిపి జిల్లా అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డి జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో ప్రధాన రిజర్వాయర్ల లో నీరు అడుగంటి పోతున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, శ్రీశైలం లో నీరు సంవృద్ధిగా వున్నా సోమశిల,కండలేరు జలాశయాలకు నీరు వదలకుండా ఈ ప్రభుత్వం నెల్లూరు జిల్లా రైతులకు అన్యాయం చేస్తుందని, చంద్రబాబు నాయుడు వెన్నుపోటు ముఖ్యమంత్రి అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు శ్రీశైలం జలాశయం లో సుమారు 71 శాతం నీరు నిల్వఉందని, సోమశిల, కండలేరు జలాశయాల్లో మాత్రం 25 శాతం మాత్రమే నీరు ఉందని అన్నారు. పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా నెల్లూరు జిల్లా జలాశయాలకు నీరు వదిలే అవకాశం ఉన్నా నీరు వదలడం లేదని, శ్రీశైలం జలాశయం నుండి తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి,నీటిని వాడుకుంటూ ఉంటే ఆంధ్రా నాయకులు ఇక్కడ ఓట్లు తో గెలిచి తెలంగాణ నాయకులకు ఊడిగం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు... తెలంగాణ ముఖ్యమంత్రి తో ఉన్న సంబంధాలు వలన కూటమి ప్రభుత్వం ఆంధ్రా ప్రజలకు మోసం చేస్తుందని చెప్పారు. నెల్లూరు జిల్లా లో 10 కి 10 సీట్లు గెలిపించినా ప్రజలను మోసం చేస్తూ నీరు ఇవ్వడం లేదని చెప్పారు.వర్షాలు లేకుండా ఉంటే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని చెప్పారు. ఆంధ్రాలో అగ్రికల్చర్ హార్టికల్చర్ శాఖలు లేవు భూములు దోచుకునే శాఖ మాత్రమే ఉందని చెప్పారు. నీటి నిర్వహణ పై కనీస అవగాహన లేకండా వ్యవహరిస్తున్నారని,నీరు పారుదల గురించి కాకుండా నిధుల పారుదల గురించి మాత్రమే నాయకులు ఆలోచిస్తున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. నెల్లూరు జిల్లా కు సంబంధించి సోమశిల, కండలేరు నీటి పై సమీక్షలు నిర్వహించాలని, వెంటనే సోమశిల,కండలేరు జలాశయాలకు నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లా రైతాంగానికి అండగా YSRCP పార్టీ పోరాటం చేస్తుందని కాకాణి స్పష్టం చేశారు