Kaizer News

ఈ బుడ్డోడి పాఠాలకు లక్షల మంది ఫాలోవర్లు

ఈ బుడ్డోడి పాఠాలకు లక్షల మంది ఫాలోవర్లు

· State - Telangana · ntnews.com

ఇంగ్లిష్‌ గ్రామర్‌ అయినా, గణిత సూత్రాలైనా.. ఏవైనా సరే ఈ పిల్లాడు చెప్పాడంటే అది లక్షల మందికి చేరిపోతుంది. అలాగని తానేదో ఐఐటీ ఫౌండేషన్‌లో చదువుకోలేదు. పెద్ద కార్పొరేట్‌ స్కూల్‌కూ వెళ్లడం లేదు. ఈ బుడ్డోడు చదివేది ఓ గ్రామంలో ఉన్న సర్కార్‌ బడిలో! పిట్టకొంచెం కూత ఘనం అనే సామెతకు సరిగ్గా సరిపోతాడు తొమ్మిదేండ్ల చింతకింది వరుణ్‌. ఐదో తరగతిలోనే బోర్డుపై పాఠాలు చెబుతూ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాడు. ఈ కుర్రాడిని సోషల్‌ మీడియాకు పరిచయం చేసిన ఆ పాఠశాల హెచ్‌ఎం కుక్కడపు రమేశ్‌ తన విద్యార్థి ప్రతిభ గురించి బతుకమ్మతో ఇలా పంచుకున్నారు.. నేను 2002 ఉపాధ్యాయ వృత్తిలోకి అడుగుపెట్టాను. చేరిన కొత్తలోనే వినూత్నమైన బోధనకు శ్రీకారం చుట్టాను. విద్యార్థుల ప్రతిభను వెలికి తీయడంలో భాగంగా వారితో కొత్త కొత్త ప్రయోగాలు చేయడం నాకు అలవాటు. పాఠ్యపుస్తకంలోని అంశాలు అర్థం చేయించేందుకు 2014లో పాటల పాఠాలు, 2015లో విద్య వికసించేదెలా? అనే రెండు పుస్తకాలు రాశాను. అయితే పుస్తక పఠనం తగ్గిపోతున్న నేపథ్యంలో 2019లో ‘రమేశ్‌ సార్‌ స్టడీ సాంగ్స్‌’ పేరుతో సోషల్‌ మీడియా ఖాతా తెరిచాను. ప్రస్తుతం నల్లగొండ జిల్లా వలిగొండ మండలం పహిల్వాన్‌పూర్‌ ప్రాథమిక పాఠశాల హెడ్‌మాస్టర్‌గా పనిచేస్తున్న నాకు వరుణ్‌ రెండేండ్ల నుంచి పరిచయం. వరుణ్‌ సొంతూరు యాదాద్రి భువనగిరి జిల్లా, భూదాన్‌ పోచాన్‌పల్లి మండలంలోని జూలూరు. అయితే ఆ అబ్బాయి కుటుంబం ఉపాధిని వెతుక్కుంటూ పహిల్వాన్‌పూర్‌కు వలసొచ్చి తోటపనిలో కుదిరింది. అలా వరుణ్‌తోపాటు, అతని చెల్లెలు కూడా మా బడిలోనే చేరారు. అలా మొదలు నేను పాఠాలు చెప్పే సందర్భంలో ఆ పాఠం విద్యార్థులకు అర్థమైందో లేదో అని తెలుసుకునేందుకు తిరిగి వారిచేతే చెప్పిస్తుంటాను. ఈ సమయంలోనే వరుణ్‌ టాలెంట్‌ బయటపడింది. ఆ అబ్బాయి అందరిలాగా కాకుండా నేను చెప్పిన ైస్టెల్‌లో తిరిగి నాకు అప్పచెప్పడం చూసి చాలా ఆశ్చర్యానికి గురయ్యాను. ఒక్కసారి వింటే చాలు తిరిగి తనకు అర్థమైన రీతిలో చెప్పే ఆ టాలెంట్‌ విద్యార్థుల్లో అరుదుగా ఉంటుంది. ఆరు నెలల క్రితం అనుకోకుండా తను ఓ పాఠం వివరిస్తుండగా వీడియో తీసి సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశాను. ఆ వీడియాను చూసిన వాళ్లంతా ఆ పిల్లాడి మేధస్సును మెచ్చుకుంటూ కామెంట్ల వర్షం కురిపించారు. అలా వరుణ్‌ ప్రపంచానికి పరిచయమయ్యాడు. నా సోషల్‌ మీడియా అకౌంట్లో ఉన్న 6000 వీడియోల్లో 700కు పైగా వీడియోలు వరుణ్‌వే. చాలామంది సామాజిక మాధ్యమాలన్నా, కెమెరా ముందుకు రావాలన్నా భయపడతారు. ఈ పిల్లాడు మాత్రం అవలీలగా పాఠం మొత్తం చెప్పేస్తాడు. చాలామంది స్క్రిప్ట్‌ ప్రకారమే వీడియోలో మాట్లాడతాడని భావిస్తారు! కానీ, నేను వరుణ్‌కు ఎలాంటి స్క్రిప్టూ ఇవ్వను. తాను మాట్లాడే అంశాన్ని వివరిస్తాను అంతే. తన అవగాహన మేరకు చెబుతూపోతాడు. ప్రస్తుతం ఐదో తరగతి చదువుతున్న వరుణ్‌ ఇంగ్లిష్‌, లెక్కలు వంటి పాఠ్యాంశాలు మాత్రమే కాకుండా సామాజిక అంశాలను కూడా భలేగా చెబుతాడు. అందుకోసం మా పాఠశాలలో ఉన్న మినీ లైబ్రరీలో ఇతిహాసాలు, నీతి కథలకు చెందిన పుస్తకాలను చదువుతాడు. అందులోని సారాన్ని ఈ తరానికి అన్వయించుకొని చెబుతాడు. కొంతమంది వరుణ్‌ వీడియోలు చూసి పాఠాలు నేర్చుకుంటున్

Original source: ntnews.com
Read more on Kaizer News