Kaizer News

తెలంగాణలో మరో మూడ్రోజులు ముసురు.. హైదరాబాద్లో తేలి

తెలంగాణలో మరో మూడ్రోజులు ముసురు.. హైదరాబాద్లో తేలికపాటి వర్షాలు..

· State - Telangana · v6velugu.com

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో వచ్చే మూడు రోజులు ముసురు పట్టి ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని, ప్రస్తుతం బెంగాల్, ఉత్తర ఒడిశా ప్రాంతాల్లో కొనసాగుతున్నదని తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో ముసురు పట్టే అవకాశం ఉందని వెల్లడించింది. హైదరాబాద్ లోనూ తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అయితే, ఆదివారం పలుజిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిశాయి. హైదరాబాద్ సిటీలో ఉదయం నుంచే పలు ప్రాంతాల్లో వర్షం పడింది. మల్కాజిగిరిలో 1.4 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అడ్డగుట్టలో 1.4 సెంటీమీటర్లు, షామీర్​పేట్​లో 6.3 మిల్లీమీటర్ల వాన పడింది. ఇటు జగిత్యాల, యాదాద్రి, నిర్మల్, ఆసిఫాబాద్ జిల్లాల్లోనూ తేలికపాటి జల్లులు పడ్డాయి

Original source: v6velugu.com
Read more on Kaizer News