Kaizer News

Mydukur: వైఎస్సార్‌సీపీ నాయకులకు ఐడీ కార్డుల పంపిణ

Mydukur: వైఎస్సార్‌సీపీ నాయకులకు ఐడీ కార్డుల పంపిణీ - రఘురామిరెడ్డి

· State - Telangana · hmtvlive.com

Shorts మైదుకూరు: రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు మైదుకూరు వైఎస్సార్‌సీపీ పార్టీ కార్యాలయంలో ఐడెంటిటీ కార్డుల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. మైదుకూరు మాజీ శాసనసభ్యులు రఘురామిరెడ్డి గారి చేతుల మీదుగా పార్టీకి చెందిన వివిధ స్థాయిల కమిటీ సభ్యులకు ఈ గుర్తింపు కార్డులను అందజేశారు. ​ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి గారు మాట్లాడుతూ రాష్ట్ర, జిల్లా, డివిజన్, అసెంబ్లీ మరియు మున్సిపాలిటీ కమిటీల నాయకులకు, కార్యకర్తలకు ఐడీ కార్డులు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి నాయకులందరూ ఐక్యంగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News