Kaizer News

Chowdepalle: భక్తిశ్రద్ధలతో బాబా రాందేవ్ జయంతి ఉత్

Chowdepalle: భక్తిశ్రద్ధలతో బాబా రాందేవ్ జయంతి ఉత్సవాలు, పాదయాత్ర

· State - Telangana · hmtvlive.com

Shorts చౌడేపల్లె: బాబా రాందేవ్ జీ జయంతి వేడుకలను పురస్కరించుకుని మార్వాడీ సమాజ్ సభ్యులు అత్యంత భక్తిశ్రద్ధలు, ఉత్సాహాల మధ్య శోభాయాత్రను నిర్వహించారు. చౌడేపల్లి పట్టణం నుంచి బయలుదేరిన భక్తులు.. కాలినడకన మదనపల్లె వరకు పాదయాత్రగా తరలివెళ్లారు అక్కడ రాందేవ్ జి బాబా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు సమర్పించారు. ఈ సందర్భంగా పట్టణంలో డీజే పాటల హోరు, సాంప్రదాయ వాయిద్యాల నడుమ వైభవంగా ర్యాలీ నిర్వహించారు. వర్ణరంజిత దుస్తులు ధరించిన మహిళల నృత్యాలు, రాసలీలల ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచి, పట్టణ ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఆధ్యాత్మిక చింతన, ఉత్సాహం ఉరిమిపడిన ఈ పాదయాత్రలో మార్వాడీ సంఘం ప్రతినిధులు, యువకులు, మహిళలు మరియు చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News