పూతలపట్టు: చిత్తూరు జిల్లా పూతలపట్టు లో గంగారపు గోపి నూతన గృహప్రవేశం వేడుకలకు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు హాజరై వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం కాజూరి బాలాజీ గారి ఆహ్వానం మేరకు వారి నివాసానికి వెళ్లిమంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు, కుటుంబ సభ్యులను ఆత్మీయంగా పలకరించి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గంగారపు గోపి కుటుంబ సభ్యులను, కాజూరి బాలాజీ కుటుంబ సభ్యులను మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు ఆత్మీయంగా పలకరించి, నూతన గృహంలో సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, ఐశ్వర్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ గారు, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ గారు, షణ్ముఖ రెడ్డి గారు, పార్లమెంట్ అధ్యక్షులు, పార్లమెంట్ కార్యదర్శి సునీల్ చౌదరి గారు, చూడ చైర్మన్ కటారి హేమలత గారు, కాజూరి బాలాజీ గారు, మాజీ మార్కెట్ చైర్మన్ తదితరులు పాల్గొన్నారు