Kaizer News

నానో ఎరువులు వినియోగించాలి : డీఏఓ

· State - Telangana · sakshi.com

పాన్‌గల్‌: రైతులు రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి నానో ఎరువులు వినియోగించేలా అధికారులు అవగాహన కల్పించాలని జిల్లా వ్యవసాయ అధికారి ఆంజనేయులు అన్నారు. శనివారం మండలంలోని రేమద్దులలో ఆత్మ శిక్షణ కార్యక్రమంలో ఆయనతో పాటు కేవీకే శాస్త్రవేత్త డా. భవాని పాల్గొని రైతుల పొలాలకు వెళ్లి నానో ఎరువులను పిచికారీ చేసి అవగాహన కల్పించడంతో పాటు ఆయిల్‌పాం పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతులు ఎక్కువగా రసాయన ఎరువులకు అలవాటు పడ్డారని.. వాటి వినియోగం తగ్గించేందుకు నానో యూరి యా, నానో డీఏపీ, నానో జింక్‌ అందుబాటులోకి వ చ్చినట్లు పేర్కొన్నారు. ఎల్‌నినో ప్రభావంతో ఆరుతడి పంటలు, కూరగాయాలు, పప్పు ధాన్యాలు, ఆయిల్‌పాం సాగు చేసుకోవాలని రైతులకు సూచించారు. సమావేశంలో ఏడీఏ తిప్పేస్వామి, ఇన్‌చార్జ్‌ ఏఓ రమేష్‌నాయక్‌, హెచ్‌ఓ కృష్ణయ్య, సర్పంచ్‌ నిరంజన్‌, ఏఈఓలు, రైతులు పాల్గొన్నారు. ఇది చీరల సీజన్.. గ్లామరస్ శ్రద్ధాదాస్ (ఫొటోలు) 'యేషనాగుల కట్టమీద' పాట రిలీజ్.. షూటింగ్ టైంలో ఇలా (ఫొటోలు) నెల్లూరులో సందడి చేసిన సినీనటి నిధి అగర్వాల్ (ఫొటోలు) నాగార్జున బర్త్‌డే స్పెషల్‌.. తెరపై చూడని అరుదైన ఫొటోలు మరోసారి పెళ్లి పీటలెక్కిన సీరియల్‌ నటి.. వైరల్‌గా (ఫొటోలు) 11 కిలోలు పెరిగా.. నా Babyకి మీరే పేరు పెట్టాలి.. ప్రెగ్నెన్సీపై సామ్ రియాక్షన్ నేపాల్ లో టెన్నన్ టెన్సన్.. కృత్రిమ సరస్సు బద్దలైతే మరో ప్రళయమే నవంబర్ లో పెళ్లి.. పాత కక్షలే ప్రాణం తీశాయా..? మనుగూరులో గ్యాంగ్ వార్ కలకలం

Original source: sakshi.com
Read more on Kaizer News