ఆదర్శ్ గ్రామ యోజన నిధులను సకాలంలో వినియోగించాలి ఎస్సీ, ఎస్టీ, బీసీ యువతకు అమర్ రాజా బ్యాటరీస్‌లో శిక్షణ, ఉద్యోగావకాశాలు ఎస్సీలకు ఎంఎస్‌ఎంఈలపై విస్తృత అవగాహన కల్పించాలి జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి కర్నూలు రూరల్ బ్యూరో, ఆంధ్రప్రభ : ఆదర్శ్ గ్రామ యోజన కింద జిల్లాలో అందుబాటులో ఉన్న నిధులను సకాలంలో సద్వినియోగం చేసి, ఎస్సీ జనాభా అధికంగా ఉన్న గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో శుక్రవారం ఎస్సీ, ఎస్టీ సంక్షేమ కార్యక్రమాల అమలు, నెట్ జీరో క్యాంపస్‌ల పురోగతిపై వివిధ సంక్షేమ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు శాఖల పరిధిలో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సమీక్షించారు. ఆదర్శ్ గ్రామ యోజన కింద జిల్లాలో ఎస్సీ జనాభా 50 శాతానికి పైగా ఉన్న గ్రామాల్లో తాగునీరు, ఇతర మౌలిక వసతుల కల్పనకు గ్రామ అభివృద్ధి ప్రణాళికలు రూపొందించి పనులకు అనుమతులు పొందినట్లు కలెక్టర్ తెలిపారు. ప్రస్తుతం వివిధ దశల్లో ఉన్న పనులను వేగవంతం చేసి నవంబర్ నెలాఖరులోగా నిధులను పూర్తిస్థాయిలో వినియోగించాలని ఆదేశించారు. డీవీఎంసీ సమావేశాలను క్రమం తప్పకుండా నిర్వహించాలని సాంఘిక సంక్షేమ శాఖ అధికారిని సూచించారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ కింద ఎంత నిధులు మంజూరయ్యాయి, ఎంత ఖర్చు చేశారు, ఎంతమంది లబ్ధిదారులకు ప్రయోజనం కల్పించారనే వివరాలతో సమగ్ర నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. సంక్షేమ పథకాల అమలులో శాఖల మధ్య సమన్వయం పెంచి, దరఖాస్తులు, రుణ మంజూర్లు, స్వయం ఉపాధి అవకాశాల్లో స్పష్టమైన పురోగతి కనిపించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలోని పోర్టల్‌పై విస్తృత ప్రచారం నిర్వహించి ఎస్సీ లబ్ధిదారులను సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల వైపు ప్రోత్సహించాలని కలెక్టర్ పేర్కొన్నారు. తయారీ, సేవలు, వ్యాపారం, వర్క్‌షాప్‌లు తదితర రంగాల్లో ఉన్న ఉపాధి అవకాశాలను వారికి వివరించాలని సూచించారు. పీఎంఈజీపీకి సంబంధించి కొత్త మార్గదర్శకాలు అందుబాటులోకి వచ్చిన వెంటనే విస్తృత ప్రచారం చేపట్టాలని, ఆన్‌లైన్ దరఖాస్తుల్లో లబ్ధిదారులకు ఇబ్బందులు ఎదురైతే ప్రత్యేక సహాయం అందించాలని ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా తిరుపతికి చెందిన అమర్ రాజా బ్యాటరీస్ సంస్థలో శిక్షణ, ఉద్యోగ అవకాశాలను వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు. ఏడాది పాటు శిక్షణతో పాటు శిక్షణ కాలంలో నెలకు రూ.13 వేల స్టైపెండ్, శిక్షణ అనంతరం ఉద్యోగం కల్పించి నెలకు రూ.25 వేల వేతనం అందించే అవకాశం ఉందన్నారు. 10వ తరగతి ఉత్తీర్ణులైన 19 నుంచి 35 ఏళ్ల వయస్సు గల ఎస్సీ, బీసీ యువతకు ఈ అవకాశంపై విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో గిరిజన సహకార సంస్థ ఉత్పత్తుల విక్రయానికి ప్రత్యేక అవుట్‌లెట్ ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలని ట్రైబల్ వెల్ఫేర్ అధికారులను ఆదేశించారు. అరకు కాఫీ విక్రయానికి కూడా ప్రత్యేక అవుట్‌లెట్ ఏర్పాటు చేసేలా ప్రతిపాదనలు సిద్ధం చే