ఐఐటీ కాన్పూర్ వైద్య విద్యలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. అయితే ముందుగా MBBS కోర్సును కాకుండా DM, MCh వంటి ఉన్నత వైద్య, సూపర్ స్పెషాలిటీ కోర్సులను ప్రారంభించనుంది. MBBS ప్రారంభానికి మరో 3–4 ఏళ్లు పట్టే అవకాశం ఉందని డీన్ ప్రొఫెసర్ అనిల్ కె. లాల్వానీ తెలిపారు. గ్యాంగ్వాల్ స్కూల్ సమీపంలో 500 పడకల యాదుపతి సింఘానియా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, 50 పడకల క్యాన్సర్ కేర్ అండ్ రీసెర్చ్ సెంటర్ నిర్మిస్తున్నారు. వైద్యం, ఇంజినీరింగ్, పరిశోధనలను అనుసంధానం చేస్తూ కొత్త తరహా వైద్య నిపుణులను తయారు చేయడమే ఐఐటీ కాన్పూర్ లక్ష్యంగా పెట్టుకుంది