Shorts అనకాపల్లి: అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గ పరిధిలోని రోలుగుంట మండలం బుచ్చింపేట గ్రామ పంచాయతీ కి సంబంధించి బుచ్చంపేట గ్రామంలో కొత్త వీధి లో నీటి సరఫరా విభాగం మరమ్మత్తుకు గురి కావటం జరిగిందని, దీని వల్ల స్థానిక కొత్త వీధి ప్రజలు మంచి నీటి కోసం ఇబ్బందులకు గురవుతున్న విషయం స్థానికులు ఇదే గ్రామానికి చెందిన అనిమిరెడ్డి రమణ కి తెలియజేయగా సంబంధిత అధికారుల సమన్వయంతో సమస్యకి ఈ రోజు పరిష్కారం చూపటం జరిగింది. సమస్య పరిష్కారం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తూ అనిమిరెడ్డి రమణ కు కృతజ్ఞతలు తెలియచేయడం జరిగింది