Kaizer News

ఇద్దరు డీజే నిర్వాహకులపై కేసునమోదు

ఇద్దరు డీజే నిర్వాహకులపై కేసునమోదు

· State - Telangana · prabhanews.com

డీజే, వాహనం స్వాధీనం దండేపల్లి, ఆంధ్రప్రభ: ఎలాంటి అనుమతులు లేకుండా అధిక శబ్దంతో డీజే నిర్వహిస్తున్న ఇద్దరిపై దండేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. దండేపల్లి ఎస్సై రాజవర్ధన్ క‌థనం ప్ర‌కారం.. శనివారం రాత్రి మండలంలోని ద్వారక ప్రభుత్వ పాఠశాల వద్ద పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా, ఓ వాహనంలో అధిక శబ్దంతో డీజే నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. పోలీసులు డీజే నిర్వహణకు సంబంధించిన అనుమతి పత్రాలను చూపించాలని కోరగా, సంబంధిత వ్యక్తులు ఎలాంటి అనుమతులు చూపించలేదు. దీంతో పాత మామిడిపల్లి గ్రామానికి చెందిన అవుల వంశీ, నాసం వినయ్‌లను అదుపులోకి తీసుకున్నారు. డీజే ధ్వని పరికరాలతో పాటు వాహనాన్ని స్వాధీనం చేసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు చేపట్టారు. నిబంధనలు ఉల్లంఘిస్తూ అధిక శబ్దంతో డీజేలు నిర్వహించే వారిపై చట్టప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు

Original source: prabhanews.com
Read more on Kaizer News