Cherial: సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణ కేంద్రం లోని వాహన దారులు విచ్చవిడిగా పార్కింగ్ చేయడం తో వచ్చిపోయే వాహనాలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది. ముఖ్యంగా చేర్యాల పట్టణం లోని వీరభద్ర తియేటర్ మరియు పాత బస్టాండ్ వద్ద రోజు ఇదే తంతు కొనసాగుతున్న పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోక పోవడం తో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జనగామ -సిద్దిపేట ప్రధాన రహదారి కావడం తో రోజు వందలాది వాహనాలు వెళ్తుంటాయి. వీరభద్ర సినిమా తియేటర్ వద్ద టు విల్లర్స్ ఎక్కడ పడితే అక్కడే పార్కింగ్ చేయడం తో RTC బస్సు ఎక్కడ ఆపాలో తెలియక నడి రోడ్డు మీదే ఆపడం తో ట్రాఫిక్ సమస్యలు వస్తున్నాయి. ఇప్పటికైనా ఈ సమస్య పై పోలీసులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు