Kaizer News

రేవంత్‌ది సభా హక్కుల ఉల్లంఘనే.. స్పీకర్‌కు నోటీసు

రేవంత్‌ది సభా హక్కుల ఉల్లంఘనే.. స్పీకర్‌కు నోటీసు అందజేసిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు గంగుల, పద్మారావు

· State - Telangana · ntnews.com

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 18 (నమస్తేతెలంగాణ) : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై బీఆర్‌ఎస్‌ శాసనసభా పక్షం సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చింది. ప్రతిపక్ష నేత కే చంద్రశేఖర్‌రావు భూములకు సంబంధించి అసెంబ్లీలో తప్పుడు సమాచారం ఇచ్చి ప్రజలను తప్పుదోవ పట్టించారని పేర్కొంటూ శుక్రవారం అసెంబ్లీలో స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ను బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు టీ పద్మారావు, గంగుల కమలాకర్‌ కలిసి నోటీసు అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. సభా నాయకుడైనా సీఎం రేవంత్‌రెడ్డి.. కేసీఆర్‌తోపాటు కేటీఆర్‌, హరీశ్‌రావు ఇతర నేతలపై తప్పుడు ఆరోపణలు చేశారని, ఇది ముమ్మాటికీ స భాహక్కుల ఉల్లంఘనేనని వివరించారు

Original source: ntnews.com
Read more on Kaizer News