Kaizer News

నో మ్యాపింగ్, అనామలీస్‌‌‌‌ ఓటర్లకు నోటీసులు అందజేయ

నో మ్యాపింగ్, అనామలీస్‌‌‌‌ ఓటర్లకు నోటీసులు అందజేయాలి : జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్

· State - Telangana · v6velugu.com

కోరుట్ల, వెలుగు: ఎస్‌‌‌‌ఐఆర్‌‌‌‌ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించి, అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలని జగిత్యాల కలెక్టర్​సత్యప్రసాద్​ అధికారులను ఆదేశించారు. శుక్రవారం జగిత్యాల జిల్లా కోరుట్లలో ఎస్ఐఆర్​ ప్రక్రియను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నో మ్యాపింగ్, అనామలీస్‌‌‌‌ ఓటర్లకు వ్యక్తిగతంగా నోటీసులు అందజేయాలన్నారు. ఎస్‌‌‌‌ఐఆర్‌‌‌‌ నోటీసులపై విచారణను పకడ్బందీగా నిర్వహించాలన్నారు. ఓటర్ల నుంచి సేకరించిన ఆధారాలు, సంబంధిత వివరాలను ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో సక్రమంగా నమోదు చేయాలని సూచించారు. అనంతరం కథలాపూర్ మండల కేంద్రం, ఇప్పపల్లి, సిరికొండ గ్రామాల్లోని నిర్మాణంలో ఉన్న బిల్డింగ్‌‌‌‌లను కలెక్టర్​తనిఖీ చేశారు. అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్నం భోజనం చేశారు. మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందుతున్నదా, లేదా అనే విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. ఆర్డీవో జీవాకర్ రెడ్డి, డీఈవో కె.రాము, డీపీవో మదన్ మోహన్, తహసీల్దార్ రమేశ్‌‌‌‌, ఎంపీడీవో శంకర్, సర్పంచులు, వార్డు సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు

Original source: v6velugu.com
Read more on Kaizer News