Kaizer News

వైభవ్ సూర్యవంశీకి నో ఛాన్స్.. టీమిండియా నుంచి ఆ ఇద

వైభవ్ సూర్యవంశీకి నో ఛాన్స్.. టీమిండియా నుంచి ఆ ఇద్దరికే చోటు!

· Sports · sakshi.com

టీమిండియా మాజీ వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ దినేష్ కార్తీక్ ప్ర‌స్తుతం ప్ర‌పంచ క్రికెట్‌లో టాప్ 5 ఆల్-ఫార్మాట్ ప్లేయ‌ర్ల‌ను ఎంచుకున్నాడు. ఈ జాబితాలో భార‌త టెస్టు, వ‌న్డే కెప్టెన్ శుబ్‌మ‌న్ గిల్‌కు అగ్ర‌స్ధానం ద‌క్కింది. ఆ త‌ర్వాత రెండో స్ధానంలో ఆసీస్ స్టార్ ఓపెన‌ర్ ట్రావిస్ హెడ్‌కు కార్తీక్ ఛాన్స్ ఇచ్చాడు. మూడు, నాలుగు స్దానాల్లో హ్యారీ బ్రూక్‌(ఇంగ్లండ్‌), య‌శ‌స్వి జైశ్వాల్(భార‌త్‌)కు చోటు ద‌క్కింది. చివ‌ర‌గా ఐదో స్దానంలో న్యూజిలాండ్ ఆల్‌రౌండ‌ర్ ర‌చిన్ ర‌వీంద్ర‌కు డీకే అవ‌కాశ‌మిచ్చాడు. కాగా టాప్ ప్లేస్‌లో ఉన్న శుబ్‌మన్ గిల్ గత కొంత కాలంగా వన్డే, టెస్టుల్లోనూ నిలకడగా రాణిస్తున్నాడు. భారత టీ20 జట్టుకు అతడు దూరంగా ఉన్నప్పటికి ఐపీఎల్ వంటి ఫ్రాంచైజీ లీగ్స్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఈ కారణంగానే గిల్‌ను ఆల్‌ఫార్మాట్ ప్లేయర్‌గా కార్తీక్ ఎంపిక చేశాడు. ట్రావిస్ హెడ్ కూడా మూడు ఫార్మాట్లలోనూ ఆసీస్‌కు కీలక ప్లేయర్‌గా మారాడు. తన దూకుడు బ్యాటింగ్‌తో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసే సత్తా అతడిది. ఇక ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్ హ్యారీ బ్రూక్ కూడా వన్డే, టీ20లతో పాటు టెస్టుల్లో కూడా మ్యాచ్ విన్నింగ్ నాక్స్ ఆడుతున్నాడు. ప్రస్తుతం పాక్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లోనూ దుమ్ములేపుతున్నాడు. అయితే యశస్వి జైశ్వాల్, రచిన్ రవీంద్రలు మాత్రం గత కొంతకాలంగా తమస్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నారు. అయినప్పటికి డికే వారికి బెస్ట్ ఆల్ ఫార్మాట్ ప్లేయర్ల జాబితాలో అవకాశమిచ్చాడు. కాగా ఈ లిస్ట్‌లో భారత యువ సంచలనం వైభవ్‌ సూర్యవంశీకి చోటు ఇచ్చి ఉంటే బాగుండేది అని క్రికెట్‌ ఫ్యాన్స్‌ అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే 15 ఏళ్ల వైభవ్‌ ఇప్పటికే టెస్టు, వన్డే, టీ20 ఫార్మాట్లలో తన సత్తాను నిరూపించుకున్నాడు. అయితే వైభవ్‌ ఇంకా భారత జట్టు తరపున టెస్టు, వన్డే డెబ్యూ చేయనుందున కార్తీక్‌ ఈ లిస్ట్‌లో చోటు ఇవ్వలేదు. చదవండి : ‘బౌలింగ్ ఇవ్వమని పేచీ.. క్యాచ్‌ డ్రాప్‌.. కోపంతో ఊగిపోయా’ ఇది చీరల సీజన్.. గ్లామరస్ శ్రద్ధాదాస్ (ఫొటోలు) 'యేషనాగుల కట్టమీద' పాట రిలీజ్.. షూటింగ్ టైంలో ఇలా (ఫొటోలు) నెల్లూరులో సందడి చేసిన సినీనటి నిధి అగర్వాల్ (ఫొటోలు) నాగార్జున బర్త్‌డే స్పెషల్‌.. తెరపై చూడని అరుదైన ఫొటోలు మరోసారి పెళ్లి పీటలెక్కిన సీరియల్‌ నటి.. వైరల్‌గా (ఫొటోలు) నేపాల్ లో టెన్నన్ టెన్సన్.. కృత్రిమ సరస్సు బద్దలైతే మరో ప్రళయమే నవంబర్ లో పెళ్లి.. పాత కక్షలే ప్రాణం తీశాయా..? మనుగూరులో గ్యాంగ్ వార్ కలకలం వామ్మో బియ్యం.. కొనాలంటే భయం రైతుల రియాక్షన్.. ఇది నెక్స్ లెవల్ స్మగ్లింగ్.. సినిమాల్లో కూడా చూసి ఉండరు నోరెళ్లబెట్టిన పోలీసులు

Original source: sakshi.com
Read more on Kaizer News