Kaizer News

Tantikonda: అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా పోషణ మాసోత్స

Tantikonda: అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా పోషణ మాసోత్సవాలు

· State - Telangana · hmtvlive.com

Shorts తంటికొండ: చిన్నారులు, గర్భిణులు, బాలింతల్లో పోషకాహారంపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా తంటికొండ-3 అంగన్వాడీ కేంద్రంలో పోషణ మాసోత్సవాల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. తంటికొండ సెక్టార్ ఐసీడీఎస్ సూపర్‌వైజర్ ఇందిరారాణి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పోషకాహారం ప్రాధాన్యతను వివరించారు. చిన్నారుల శారీరక, మానసిక ఎదుగుదలకు సమతుల్యమైన పోషకాహారం ఎంతోఅవసరమని కార్యక్రమంలో పాల్గొన్న సిబ్బంది పేర్కొన్నారు. స్థానికంగా లభించే పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలనుపిల్లలకుఅందించడం ద్వారా ఆరోగ్యకరమైన భవిష్యత్తుకుబాటలువేయవచ్చని సూచించారు. తల్లులు కూడా పిల్లల ఆహారపు అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా పోషకాహారానికి సంబంధించిన అంశాలను తల్లులకు వివరించడంతో పాటు, అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందుతున్నసేవలనుసద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పోషకాహార మాసోత్సవాల ఉద్దేశాలనుప్రజల్లోకితీసుకెళ్లేందుకు ఇలాంటి కార్యక్రమాలు మరింతవిస్తృతంగానిర్వహించాల్సినఅవసరంఉందనితెలిపారు.ఈకార్యక్రమంలో జీఎంఎస్‌కే రమ, ఎంఎల్‌హెచ్‌పీ రవి, సచివాలయఏఎన్‌ఎంవిజయలక్ష్మి,తల్లులు,తంటికొండ-3 అంగన్వాడీ వర్కర్ కె. విజయలక్ష్మి, వెల్ఫేర్ బి. భాగ్యవతి తదితరులు పాల్గొన్నారు. ఈకార్యక్రమం సందర్భంగా అంగన్వాడీ సిబ్బంది, తల్లులు చురుగ్గా పాల్గొని పోషకాహారంపై అవగాహన పెంచుకున్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News