Kaizer News

Toxic Flop : యశ్ చేసిన తప్పే ఎన్టీఆర్, అల్లు అర్జు

Toxic Flop : యశ్ చేసిన తప్పే ఎన్టీఆర్, అల్లు అర్జున్, మహేశ్, ప్రభాస్ చేస్తున్నారా?

· Entertainment · ntvtelugu.com

యశ్ చేసిన తప్పే ఎన్టీఆర్, అల్లు అర్జున్, మహేశ్, ప్రభాస్ చేస్తున్నారా? : --> Add as a preferred source on google ‘కేజీఎఫ్ 2’ వంటి సంచలన విజయం తర్వాత కన్నడ రాకింగ్ స్టార్ యశ్ తన తదుపరి చిత్రం ప్రకటనకే దాదాపు రెండేళ్ల సుదీర్ఘ సమయం తీసుకున్నారు. ఆ తర్వాత ప్రకటించిన ‘టాక్సిక్’ సినిమా చిత్రీకరణకే మరొక రెండేళ్లు కేటాయించారు. అయితే తీరా నాలుగేళ్ళ తర్వాత వచ్చిన ఆ చిత్రం డిజాస్టర్‌గా నిలవడంతో యశ్ తన కెరీర్‌లో అత్యంత కీలకమైన నాలుగేళ్ల సమయాన్ని వృథా చేసుకోవాల్సి వచ్చింది. ఒక సినిమాకే ఇన్ని సంవత్సరాలు కేటాయించడం ఎంత పెద్ద ప్రమాదమో ‘టాక్సిక్’ ఫలితం నిరూపించింది. ప్రస్తుతం మన టాలీవుడ్ అగ్ర కథానాయకులు కూడా ఇదే బాటలో పయనిస్తూ పెద్ద తప్పిదం చేస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మన స్టార్ హీరోలు కూడా ఒక్కో సినిమాకి మూడు నుండి నాలుగేళ్ల సమయం కేటాయిస్తున్నారు. అల్లు అర్జున్ గత రెండేళ్లుగా ‘రాకా’ ప్రాజెక్ట్‌తోనే ఉండిపోగా, ఎన్టీఆర్ ‘డ్రాగన్’ కోసం సుదీర్ఘ సమయం వెచ్చిస్తున్నారు. అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు ‘వారణాసి’తో మూడేళ్లుగా బిజీగా ఉండగా ప్రభాస్ ‘రాజాసాబ్’ చిత్రీకరణ పూర్తి చేయడానికి దాదాపు మూడేళ్ల సమయం తీసుకున్నారు. ఏడాదికి ఒక సినిమా చొప్పున థియేటర్లలోకి వస్తే ఒకవేళ ఆ సినిమా ఫ్లాప్ అయినా దాని ప్రభావం నటుడి కెరీర్‌పై చాలా తక్కువగా ఉంటుంది. కానీ మూడేళ్లు కష్టపడి చేసిన సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోతే అప్పటికే వృథా అయిన కాలంతో పాటు కెరీర్ గ్రాఫ్ కూడా ఒక్కసారిగా పడిపోతుంది. ‘టాక్సిక్’ నేర్పిన ఈ చేదు పాఠాన్ని గ్రహించి మన టాలీవుడ్ స్టార్స్ వేగంగా సినిమాలు చేస్తూ ఏడాదికో రిలీజ్ ఉండేలా ప్లాన్ చేసుకుంటారో లేదో చూడాలి

Original source: ntvtelugu.com
Read more on Kaizer News