Kaizer News

Mancherial: ఇందారం టు మంచిర్యాల: ఎంపీ వర్గం ఘన బలప

Mancherial: ఇందారం టు మంచిర్యాల: ఎంపీ వర్గం ఘన బలప్రదర్శన!

· State - Telangana · hmtvlive.com

Shorts మంచిర్యాల: పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణకు మంచిర్యాల జిల్లాలో కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు మంతెన జగన్‌మోహన్‌రావు ఆధ్వర్యంలో ఇందారం క్రాస్‌రోడ్‌ వద్ద పెద్ద సంఖ్యలో కార్యకర్తలు ఎంపీకి స్వాగతం పలికారు. అనంతరం అక్కడి నుంచి మంచిర్యాల వరకు భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ మంచిర్యాల రైల్వే స్టేషన్‌ సమీపంలోని మాజీ కేంద్రమంత్రి కాకా వెంకటస్వామి విగ్రహం వద్దకు చేరుకుంది.అక్కడ ఎంపీ వంశీకృష్ణ కాకా వెంకటస్వామి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కాకా వెంకటస్వామి స్ఫూర్తితో ప్రజల కోసం పనిచేస్తానని, నిరుద్యోగ యువతకు అండగా ఉంటానని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో 1,500 మంది విద్యార్థుల ప్రాణ బలిదానాలను ప్రస్తావిస్తూ బీఆర్‌ఎస్‌ నేత కేసీఆర్‌పై విమర్శలు చేశారు. గత పదేళ్ల పాలనలో నిరుద్యోగ సమస్య ఎందుకు కొనసాగిందో యువత ఆలోచించాలని అన్నారు. కేటీఆర్‌పై కూడా ఎంపీ తీవ్ర విమర్శలు చేశారు. గ్లోబరినా సంస్థ వ్యవహారంలో యువత ఆత్మహత్యలకు కేటీఆర్‌ కారణమయ్యారంటూ ఆరోపించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో పేద కుటుంబం అంటూ మాట్లాడిన కేటీఆర్‌.. పదేళ్ల తర్వాత భారీగా ఆస్తులు కూడబెట్టుకున్నారని వంశీకృష్ణ ఆరోపించారు. డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల హామీ ఏమైందని ప్రశ్నించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రజలు కేసీఆర్‌, కేటీఆర్‌కు గట్టి సమాధానం చెప్పారని వ్యాఖ్యానించారు. యువతను రెచ్చగొట్టేలా మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. కాంగ్రెస్‌ కార్యకర్తలకు తాము అండగా ఉంటామని, ఏదైనా తేడా వస్తే గట్టిగా సమాధానం చెబుతామని కేటీఆర్‌ను ఉద్దేశించి వంశీకృష్ణ వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో మంతెన జగన్‌మోహన్‌రావు వర్గానికి చెందిన కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 11 ఏళ్ల జర్నలిజం అనుభవం కలిగిన సీనియర్ పాత్రికేయుడు. రాజకీయాలు, సామాజిక అంశాలు, స్థానిక సమస్యలు మరియు ప్రత్యేక కథనాలపై విస్తృతంగా పనిచేస్తూ ప్రజలకు ఖచ్చితమైన, విశ్వసనీయమైన వార్తలను అందిస్తున్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News