Kaizer News

Bichkunda: బిచ్కుంద గణేష్ మందిర్‌లో ఎస్‌ఐ, రెవెన్య

Bichkunda: బిచ్కుంద గణేష్ మందిర్‌లో ఎస్‌ఐ, రెవెన్యూ అధికారుల ప్రత్యేక పూజలు!

· State - Telangana · hmtvlive.com

Shorts బిచ్కుంద: కామారెడ్డి జిల్లా బిచ్కుంద పట్టణంలోని గణేష్ మందిర్ లో వినాయక చవితి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బిచ్కుంద ఎస్‌ఐ గుండెల రాజు, డిప్యుటీ తహసీల్దార్, ఎంఆర్ఐ అంజయ్య వినాయకుడిని దర్శించుకుని స్వామివారికి పూజారి దత్తు పంతులు చే ప్రత్యేక పూజలు నిర్వహించారు. విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, శాంతి, సౌభాగ్యం కలగాలని వారు ప్రార్థించారు. జుక్కల్ నియోజకవర్గ ప్రజల జీవితాల్లో విఘ్నాలు తొలగి అభివృద్ధి, ఐశ్వర్యం నెలకొనాలని ఆకాంక్షించారు.వినాయక చవితి సందర్భంగా ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి గణనాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయి ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది

Original source: hmtvlive.com
Read more on Kaizer News