Kaizer News

Dubbak: పోతారం విద్యార్థి ప్రతిభ: ఎంబీబీఎస్ సీటు స

Dubbak: పోతారం విద్యార్థి ప్రతిభ: ఎంబీబీఎస్ సీటు సాధించిన వరప్రసాద్

· State - Telangana · hmtvlive.com

Shorts సిద్దిపేట జిల్లా: దుబ్బాక మండలం పోతారం విద్యార్థికి ఎంబీబీఎస్ సీటు, నీట్‌లో 2,18,408 ర్యాంక్.. స్టేట్ ర్యాంక్ 5,311దుబ్బాక మండలం పోతారం గ్రామానికి చెందిన కుమ్మరి సూర్యశంకర వరప్రసాద్ ఎంబీబీఎస్ సీటు సాధించి ప్రతిభ చాటాడు. ఇటీవల నిర్వహించిన నీట్ పరీక్షలో 2,18,408 ర్యాంక్‌తో పాటు స్టేట్ ర్యాంక్ 5,311 సాధించాడు. వరప్రసాద్ పదో తరగతి వరకు దుబ్బాక సోషల్ వెల్ఫేర్ పాఠశాలలో చదివాడు. అనంతరం దుబ్బాకలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు. ఎంబీబీఎస్ లక్ష్యంగా నీట్‌కు ప్రత్యేక కోచింగ్ తీసుకుని పట్టుదలతో చదివి మంచి ర్యాంకు సాధించాడు. వృత్తిరీత్యా వరప్రసాద్ తండ్రి దేవదాస్ ఆర్‌ఎంపీ వైద్యుడిగా పనిచేస్తున్నారు. తన కుమారుడిని వైద్యుడిగా చూడాలన్నది ఆయన చిరకాల కోరిక. తండ్రి కలను సాకారం చేసే దిశగా వరప్రసాద్ ఎంబీబీఎస్ సీటు సాధించి ముందడుగు వేశాడు. మేనమామలు వెంకటస్వామి, రాజేందర్ అందించిన ప్రోత్సాహం కూడా తన విజయానికి తోడ్పడిందని కుటుంబ సభ్యులు తెలిపారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News