Kaizer News

Kadapa: ప్రొద్దుటూరులో ఘనంగా కోటవీధి మట్టి వినాయక

Kadapa: ప్రొద్దుటూరులో ఘనంగా కోటవీధి మట్టి వినాయక నిమజ్జనం!

· State - Telangana · hmtvlive.com

Shorts Kadapa: ప్రొద్దుటూరు లో ఘనంగా గణనాథుల నిమజ్జనం భక్తిశ్రద్ధలతో నవరాత్రి ఉత్సవాలు ముగింపు దశకు చేరుకోవడంతో గణేశ్ నిమజ్జనోత్సవాలు అత్యంత వైభవంగా, ఆధ్యాత్మిక శోభతో జరుగుతున్నాయి. ప్రొద్దుటూరు కోటవీధిలో వినాయకుడు ప్రధాన వీధుల గుండా 'జై బోలో గణేష్ మహారాజ్ కి జై' నినాదాలు, మంగళవాయిద్యాలు, యువత డ్యాన్సుల నడుమ కోలాహలంగా సాగింది.. ​ప్రత్యేక ఆకర్షణగా కోటవీధి వినాయకుడిని మహాగణపతి నిమజ్జనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అనంతరం బొజ్జ గణపయ్య విగ్రహాన్ని ట్రాక్టర్లో ఎక్కించి, చెక్కభజనలు, కేరళ డప్పు వాయిద్యాలు, బాణాసంచా పేలుళ్ల మధ్య రంగులు చల్లుకుంటూ పురవీధుల్లో వినాయకుని గ్రామోత్సవం వైభవంగా నిర్వహించారు. చెరువులు, నదులు కలుషితం కాకుండా మట్టి వినాయక విగ్రహానికి ప్రాధాన్యత ఇచ్చారు. ​భక్తులు వేలాదిగా తరలివచ్చి బొజ్జ గణపయ్యను దర్శించుకుని, భక్తులు ఆనందోత్సాహాల నడుమ వీడ్కోలు పలికారు... ఈ కార్యక్రమంలో కమిటీ ప్రతినిధులు ఆసం, నిశిత్ రెడ్డి, సిగే, విష్ణువర్ధన్ రెడ్డి, నాని, శ్రీకాంత్ రెడ్డి, లోకి, శబరి, సాయి, తేజ తదితరులు పాల్గొన్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News