Kaizer News

మసీదులో ఆత్మాహుతి దాడి.. 21 మంది మృతి

మసీదులో ఆత్మాహుతి దాడి.. 21 మంది మృతి

· National - India · ntnews.com

ఇస్లామాబాద్‌ : పాకిస్థాన్‌లోని ఖైదర్‌ పఖ్తుంఖ్వా ప్రాంతంలోని ఓ మసీదులో శుక్రవారం ఆత్మాహుతి దాడి జరిగింది. ప్రార్థనలు చేస్తున్న సమయంలో ఈ దాడి జరగ్గా.. 21 మంది మృతి చెందారు. 70 మందికి పైగా గాయపడి దవాఖానలో చికిత్స పొందుతున్నారు.మృతుల్లో 15 మంది పోలీసులు కూడా ఉన్నారు. రెస్క్యూ సిబ్బంది సహాయక కార్యక్రమాలు చేపట్టారు. పలువురికి తీవ్రంగా గాయాలు కావడంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఈ దాడిపై ఇప్పటి వరకు ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటన చేయలేదు

Original source: ntnews.com
Read more on Kaizer News