S.J. Suryah | కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ నటించిన బ్లాక్‌బస్టర్ మూవీ ‘సర్ధార్’కు సీక్వెల్‌గా వస్తున్న చిత్రం ‘సర్ధార్ 2’. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా జరిగిన ఒక ఆసక్తికరమైన సంఘటన ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఈవెంట్‌కు విచ్చేసిన ప్రముఖ నటుడు ఎస్‌జే సూర్యకు మీడియా సిబ్బంది తాగడానికి ప్లాస్టిక్ వాటర్ బాటిల్ అందించారు. దీనిని గమనించిన ఎస్‌జే సూర్య తనదైన శైలిలో స్పందిస్తూ.. “నాకే ప్లాస్టిక్ వాటర్ బాటిల్ ఇస్తావా?” అంటూ సరదాగా వ్యాఖ్యానించడంతో అక్కడ నవ్వులు పూశాయి. వెంటనే అప్రమత్తమైన హీరో కార్తీ, పక్కనే ఉన్న గ్లాస్ వాటర్ బాటిల్‌ను ఎస్‌జే సూర్యకు అందించి పరిస్థితిని సర్దుబాటు చేశారు. కాగా, ప్లాస్టిక్ వాటర్ బాటిళ్ల వల్ల ఆరోగ్యం ఏవిధంగా పాడవుతుందనే పాయింట్ చుట్టూనే ‘సర్ధార్’ సినిమా కథ నడుస్తుందన్న విషయం తెలిసిందే. సినిమాలోని ఈ కాన్సెప్ట్‌ను గుర్తుచేస్తూ జరిగిన ఈ సరదా సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది