వీరిలో 300 మంది డెలివరీ బాయ్స్ స్కిల్ యూనివర్సిటీ పేరిట సర్కార్ రిస్క్ కేసీఆర్ హయాంలో టాస్క్‌తో వెలుగులు 8. 37 లక్షల మందికి నైపుణ్య శిక్షణ లక్షలాది మందికి ఉన్నత ఉద్యోగాలు హైదరాబాద్, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ): యువతకు నైపుణ్య శిక్షణను అందించేందుకు రేవంత్ సర్కార్ తీసుకొచ్చిన స్కిల్ యూనివర్సిటీ ఆదిలోనే అభాసుపాలవుతున్నది. ఏ ముహూర్తాన ఈ వర్సిటీని ప్రారంభించారో ఏమో గానీ బాలారిష్టాలు దాటడంలేదు. వర్సిటీ వెబ్‌సైట్‌ను చూస్తే ఇప్పటి వరకు వెయ్యి మందికే శిక్షణనిచ్చినట్టు స్పష్టమవుతున్నది. వీరిలో 300 మందికి డెలివరీ బాయ్స్‌గా శిక్షణనిచ్చారు. అంటే డెలివరీబాయ్స్‌ను తయారుచేసే సంస్థగా స్కిల్ యూనివర్సిటీ మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు స్కిల్ యూనివర్సిటీ కోసం రేవంత్ సర్కార్ ఏకంగా రూ.188కోట్లు ఖర్చు చేసింది. అంటే ఒక్కో విద్యార్థిని ప్రయోజకుడిని చేసేందుకు సర్కార్ రూ. 18.87లక్షలు ఖర్చుచేసిందా..? అనే సెటైర్లు సోషల్‌మీడియాలో పేలుతున్నాయి. రేవంత్ సర్కార్ రెండేండ్ల కిందట అట్టహాసంగా క్యాంపస్ నిర్మాణానికి శంకుస్థాపన చేసింది. ఈ యూనివర్సిటీ కోసం గతంలో అదానీ కంపెనీ నుంచి వంద కోట్లు స్వీకరించడం వివాదాస్పదమయ్యింది. కాంగ్రెస్ అధిష్ఠానం మొట్టికాయలేయడంతో విరాళాన్ని సర్కార్ వెనక్కి ఇచ్చేసింది. ఇక మేఘా కంపెనీ రూ. 200కోట్ల విరాళాన్ని ప్రకటించింది. కానీ క్యాంపస్ నిర్మాణం మాత్రం నత్తనడకన సాగుతున్నది. తొలుత గచ్చిబౌలిలోని ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజీలో తాత్కాలిక క్యాంపస్‌ను ఏర్పాటు చేశారు. ఎనిమిది నెలలు గడువకముందే అక్కడి నుంచి ఖాళీచేసి, గచ్చిబౌలిలోని త్రిపుల్ ఐటీ క్యాంపస్‌కు తరలించారు. స్కిల్ యూనివర్సిటీ ప్రభ రోజురోజుకూ తగ్గుతున్నది. ఈ వర్సిటీలో చేరేందుకు విద్యార్థులు సుముఖత చూపడం లేదు. నిజానికి శిక్షణ బాగుంటే ఈ వర్సిటీకి డిమాండ్ ఉండేది. నాలుగేండ్ల బీటెక్ అప్లయిడ్ లైఫ్ సైన్సెస్ కోర్సులో విద్యార్థులు చేరకపోవడంతో మూసివేయాల్సిన పరిస్థితి నెలకొన్నది. పలు కోర్సుల్లో మొదటి బ్యాచ్‌తో పోల్చితే రెండో బ్యాచ్‌లో విద్యార్థుల సంఖ్య తగ్గడం గమనార్హం. లాజిస్టిక్స్ అండ్ సప్లయ్ చైన్ మేనేజ్‌మెంట్ కోర్సు తొలి బ్యాచ్‌లో 25 మంది విద్యార్థులు చేరితే, రెండో బ్యాచ్‌కు వచ్చేసరికి 13కు దిగజారింది. ఎండోస్కోపీ టెక్నీషియన్ తొలిబ్యాచ్‌లో 21 మంది చేరితే, రెండో బ్యాచ్‌లో 15 మంది మాత్రమే చేరారు. మరో కోర్సులో తొలిబ్యాచ్‌లో 24 మంది చేరితే రెండో బ్యాచ్‌లో సగానికి తగ్గి 14కు చేరింది. వర్సిటీ క్యాంపస్‌లో నిర్వహిస్తున్న సర్టిఫికెట్ ఇన్ సాఫ్ట్‌స్కిల్స్‌లో నిరుడు అడ్మిషన్ పొందిన వారు కేవలం ఇద్దరు మాత్రమే ఉండటం విశేషం. చాలా కోర్సుల్లో ఇదే పరిస్థితి. గతంలో యువతకు నైపుణ్య శిక్షణనిచ్చేందుకు తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్)ను కేసీఆర్ సర్కార్ హయాంలో ఏర్పాటు చేశారు. యంగ్‌స్టార్స్ స్టార్టప్‌లను తయారుచేసేందుకు టీ హబ్, మహిళా ఆంతప్రెన్యూర్స్‌ను తయారుచేసేందుకు వీహబ్‌ను నాటి సర్కార్ నెలకొల్పింది. విద్యాసంస్థలు, పరిశ్రమల మధ్య టాస్క్ ఓ వారధిగా పనిచేస్తూ యువతకు ఆధునిక సాంకేతిక