గత కొన్నేళ్ల నుంచి సినిమాలకు లైఫ్ టైమ్ తగ్గిపోయింది. అంటే మూడు నాలుగు రోజులకే జనాలు చాలా చిత్రాల్ని లైట్ తీసుకుంటున్నారు. ఇలాంటి టైంలో రవితేజ 'ఇరుముడి' అద్భుతాలు చేస్తోంది. థియేటర్లలో రిలీజై 10 రోజులు దాటినా సరే చాలాచోట్ల హౌస్‌ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. జనాలు ఈ మూవీని బిగ్ స్క్రీన్‌పై చూసేందుకు ఇష్టపడుతున్నారు. మరోవైపు ఈ మూవీలో అయ్యప్ప హిట్ పాట పూర్తి వీడియోని యూట్యూబ్‌లో రిలీజ్ చేశారు. (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన 'ఇరుముడి' పాప థ్రిల్లర్ సినిమా ) అయ్యప్ప దీక్ష నేపథ్యంగా తీసిన 'ఇరుముడి'లో ఎంతో ఫేమస్ అయిన 'మల్లెపూల పల్లకి'తో పాటు 'ఇరుముడి కట్టు' అంటూ సాగే గీతం కూడా ఉంది. ఇప్పుడు దీని పూర్తి వీడియోనే విడుదల చేశారు. రవితేజ పోషించిన త్రినాథ్ పాత్ర.. అయ్యప్ప దీక్షని తీసుకునే క్రమంలో ఈ సాంగ్ ఉంటుంది. ఇందులో అయ్యప్ప భక్తుల నృత్యంతో పాటు రవితేజ-పాప కూడా కలిసి డ్యాన్స్ చేస్తారు. ఇకపోతే 'ఇరుముడి'కి ఇప్పటివరకు రూ.150 కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చినట్లు నిర్మాతలు ప్రకటించారు. చూస్తుంటే రూ.200 కోట్ల మార్క్ చేరుకునేవరకు ఈ సినిమా జోరు ఆగేలా లేదు. ఇకపోతే ఈ మూవీతో చాన్నాళ్ల తర్వాత రవితేజ అద్భుతమైన సక్సెస్ అందుకున్నాడు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 18 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్ ) కొత్తింట్లోకి అడుగు పెట్టిన హీరోయిన్.. గృహప్రవేశం (ఫొటోలు) ‘ధర్మస్థల నియోజకవర్గం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు) ‘రోమాంచకం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్...ముఖ్య అతిథిగా విజయ్ దేవరకొండ (ఫొటోలు) నల్గొండ జిల్లాలో ఘనంగా శ్రావణ మాసం బోనాలు (ఫొటోలు) టన్నెళ్లలో కుళ్లిన మృతదేహాలు.. నేపాల్ వరదల తర్వాత బయటపడ్డ షాకింగ్ నిజాలు.. డ్యాన్సర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా రఘు మాస్టర్ శిలాఫలకం తప్ప... వెలిగొండకు నువ్వు చేసిందేమిటి? బాబు క్రెడిట్ చోరీపై జగన్ రియాక్షన్ ఆసియా కప్ లో భారత మహిళల సత్తా.. థాయ్ లాండ్ పై తిరుగులేని గెలుపు