Kaizer News

ఎప్పుడూ మగతగా, బద్ధకంగా ఉంటుందా..? ఏ పని చేయాలన్నా

ఎప్పుడూ మగతగా, బద్ధకంగా ఉంటుందా..? ఏ పని చేయాలన్నా ఓపిక ఉండట్లేదా..? అయితే కారణం ఇదే..!

· State - Telangana · v6velugu.com

మనం ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి కావాల్సిన పోషకాలు తప్పనిసరిగా అందించాలి. అటువంటి పోషకాల్లో ముఖ్యమైనవి విటమిన్లు. విటమిన్ A,B, C, D, E, K, B1, B6, B12 ఇలా అనేక రకాల విటమిన్లు మన శరీరంలోకి వెళితేనే ఆరోగ్యం పదిలంగా ఉంటుంది. వీటిని సరియైన మోతాదులో రోజు శరీరానికి అందిస్తేనే ఆరోగ్యంగా ఉంటాం. విటమిన్ లోపం ఉన్నట్లయితే శరీరంలో అనేక మార్పులు జరుగుతాయి. ఓపిక ఉండదు. మన పనులు మనం చేసుకోవడమే కష్టంగా మారుతుంది. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచే ముఖ్యమైన విటమిన్లలో D విటమిన్ ఒకటి. ఈ D విటమిన్ లోపిస్తే ఆరోగ్యం గాడి తప్పినట్టే. D విటమిన్ లోపిస్తే ఎప్పుడూ మగతగా ఉంటుంది. బాగా చిరాకుగా ఉంటుంది. చిరాకు, కోపం, అసహనం ఉంటాయి. బద్ధకంగా ఉంటుంది. ఏ పని చేయడానికి శరీరం సహకరించదు. ఎనర్జీ కోల్పోయినట్లు అనిపిస్తుంది. కొందరికి ఒళ్లు నొప్పులు కూడా బాధిస్తాయి. చర్మం పొడిబారడం, దురదగా అనిపించడం, కొందరికి జుట్టు రాలిపోయే ప్రమాదం కూడా ఉంది. ► . టేస్ట్ అదిరిపోవాల్సిందే.. ఎలా తయారుచేయాలంటే.. డీ-విటమిన్ లోపంతో ఇబ్బంది పడుతున్న వాళ్లు.. రోజూ తినే ఆహారంలో కొన్ని మార్పులు చేసుకుని ఈ పరిస్థితి నుంచి బయటపడొచ్చు. సోయాబీన్, గుడ్లు, చీజ్, సీజనల్ పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, చేపల్లో డి విటమిన్ పుష్కలంగా ఉంటుంది. తినేది తక్కువే అయినా పౌష్టికాహారాన్ని తప్పనిసరిగా తీసుకోవాలి. పొద్దున్నే వచ్చే సూర్య కిరణాల్లో డీ-విటమిన్ పుష్కలంగా ఉంటుంది. మన శరీరంపై ఈ సూర్య కిరణాలు పడేలా ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే కాసేపు ఎండలో నిల్చోవాలి. ఇలా కొన్నికొన్ని పాటించడం వల్ల డీ-విటమిన్ లోపం నుంచి బయటపడొచ్చు

Original source: v6velugu.com
Read more on Kaizer News