Kaizer News

Ramapuram: కుమ్మరపల్లె వెల్త్ సెంటర్‌ను పరిశీలించి

Ramapuram: కుమ్మరపల్లె వెల్త్ సెంటర్‌ను పరిశీలించిన కలెక్టర్ నిశాంత్

· State - Telangana · hmtvlive.com

Shorts Ramapuram: స్వర్ణాంధ్ర- స్వచ్ఛ్ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం రామాపురం మండలం కుమ్మరపల్లె గ్రామపంచాయతీ పరిధిలోని చెత్త నుండి సంపద తయారీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గ్రామంలో చెత్త సేకరణ, తరలింపు, వ్యర్థాల నిర్వహణ జరుగుతున్న తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. చెత్త నుండి సంపద తయారీ కేంద్రాన్ని తడి, పొడి చెత్తను వేరు చేస్తున్న విధానం, వ్యర్థాల శాస్త్రీయ నిర్వహణ, వర్మీ కంపోస్టింగ్ ప్రక్రియ ప్రారంభం, అందుకు చేపట్టిన చర్యలపై వివరాలు సేకరించారు. గ్రామపంచాయతీ పరిధిలోని హ్యాబిటేషన్ల సంఖ్య, ఆయా ప్రాంతాల్లో చెత్త సేకరణ జరుగుతున్న తీరును తెలుసుకున్నారు. గ్రీన్ అంబాసిడర్లు ప్రతిరోజూ నిర్వహిస్తున్న పారిశుద్ధ్య సేవలు, ఇంటింటి చెత్త సేకరణలో వారి భాగస్వామ్యం, చెత్తను యార్డుకు తరలించే విధానం తదితర అంశాలను కలెక్టర్ పరిశీలించారు. గ్రామంలో ఎక్కడా చెత్త పేరుకుపోకుండా క్రమం తప్పకుండా పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వ్యర్థాలను సాధ్యమైనంత వరకు మూలస్థాయిలోనే వేరు చేసి, పునర్వినియోగానికి అనువైన పదార్థాలను వేరు చేయడంతో పాటు, సేంద్రియ వ్యర్థాలతో వర్మీ కంపోస్టు తయారీకి చర్యలు వేగవంతం చేయాలని సూచించారు. గ్రామపంచాయతీ పరిధిలో పరిశుభ్రమైన వాతావరణం, ప్రజలకు ఆరోగ్యకరమైన జీవన పరిస్థితులు కల్పించేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో జాషువా, తాసిల్దార్ , మండల స్థాయి సంబంధిత అధికారులు , తదితరులు పాల్గొన్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News