పటమట, ఆంధ్రప్రభ : కరాటే శిక్షణతో శారీరక దారుఢ్యంతో పాటు మానసిక బలం, ఆత్మస్థైర్యం పెంపొందుతాయని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ అన్నారు. పటమటలో ఆదివారం నిర్వహించిన కరాటే శిక్షణ శిబిరంలో ప్రతిభ చూపిన క్రీడాకారులకు ఆయన బహుమతులు అందజేశారు. యువత క్రీడల్లో శిక్షణ పొంది ప్రతిభను చాటుకోవాలని సూచించారు. కరాటేలో ఎన్నో ఏళ్లుగా శిక్షణ అందిస్తున్న డాక్టర్ బ్రహ్మానందాన్ని, శిక్షణ పొందుతున్న విద్యార్థుల తల్లిదండ్రులను అభినందించారు. కార్యక్రమంలో పి.మల్లేశ్వరరావు, డాక్టర్ కిలారి నాగశ్రీనాథ్, సీహెచ్.పూర్ణ, ఉప్పాడ విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు