బెల్లంపల్లి రూరల్, ఆంధ్రప్రభ : బీజేపీ ఎస్టీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడిగా రెడ్డి బాలరాజ్, కాసిపేట మండల అధ్యక్షుడిగా భూక్యా నాగరాజు నియమితులయ్యారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు వారికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ.. తమపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వీరబెల్లి రఘునాథ్, జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్, ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షుడు ప్రేమ్‌సింగ్, మండల అధ్యక్షుడు సూరం సంపత్ కుమార్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. మండలంలో పార్టీ బలోపేతానికి, గిరిజనుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని వారు పేర్కొన్నారు