Kaizer News

ఎదురెదురుగా బైకులు ఢీ.. ఒకరి మృతి

ఎదురెదురుగా బైకులు ఢీ.. ఒకరి మృతి

· State - Telangana · prabhanews.com

మరో వ్యక్తి పరిస్థితి విషమం భీమారం, ఆంధ్రప్రభ: రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్న ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ ట్రాక్టర్ డ్రైవర్ మృతి చెందగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఘటన భీమారంలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్కతుర్తి మండలం దామెర గ్రామానికి చెందిన పండాల రాజు (32) వృత్తిరీత్యా ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తూ రామారంలో నివాసం ఉంటున్నాడు. శనివారం రాత్రి తన ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా భీమారంలోని బీరువాల షాపు వద్ద యూటర్న్ తీసుకుంటున్నాడు. అదే సమయంలో హుజూరాబాద్ నుంచి హనుమకొండ వైపు వస్తున్న మరో ద్విచక్ర వాహనంతో రాజు ప్రయాణిస్తున్న బైక్ ఎదురెదురుగా ఢీకొంది. ఈ ప్రమాదంలో పండాల రాజుతో పాటు ఎస్‌ఆర్‌ఆర్‌ తోటకు చెందిన మనోజ్ తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న కేయూ ఎస్సై బి. విజయ్‌కుమార్ సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను వెంటనే ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే పండాల రాజు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తీవ్ర గాయాలపాలైన మనోజ్‌కు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు

Original source: prabhanews.com
Read more on Kaizer News