Kaizer News

Srikalahasti: ఘనంగా గణపతి హోమం, అన్నదానం

Srikalahasti: ఘనంగా గణపతి హోమం, అన్నదానం

· State - Telangana · hmtvlive.com

Shorts శ్రీకాళహస్తి: వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా శ్రీకాళహస్తి పట్టణంలోని బెరివారి మండపం సమీపంలో కొండమిట్ట వినాయక కమిటీ ఆధ్వర్యంలో గణపతి హోమం, ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, కొండమిట్ట వినాయక కమిటీ గౌరవ అధ్యక్షులు కోలా ఆనంద్ ముఖ్య అతిథిగా హాజరై గణపతి హోమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కోలా ఆనంద్ మాట్లాడుతూ.. బెరివారి మండపం వద్ద వెలసిన వినాయక స్వామికి గత 35 సంవత్సరాలుగా ప్రతి ఏడాది గణపతి హోమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గణపతి అనుగ్రహంతో ప్రజల జీవితాల్లోని ఆటంకాలు తొలగి, ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని ఆకాంక్షించారు. శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజలకు మానసిక ప్రశాంతత, పాజిటివ్ ఎనర్జీ కలగాలని గణపతిని ప్రార్థించినట్లు తెలిపారు. అనంతరం సుమారు 5 వేల మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి దేవస్థానం ఈఓ బీకే వెంకటేశులు, చైర్మన్ కొట్టే సాయి, బీజేపీ జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాస్, దేవస్థానం సభ్యురాలు కోలా విశాలి, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, వినాయక కమిటీ సభ్యులు, పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News