Shorts Sarvepalli: వెంకటాచల మండలం చెముడు గుంట గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఎంపీ బీదా మస్తాన్ రావు యాదవ్ సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ఎమ్మెల్యే సోమిరెడ్డి, ఎంపీ బిఎంఆర్ కు చెముడుగుంట పంచాయతీ ప్రజలు ఆత్మీయ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ అప్పుడూ...ఇప్పుడూ అభివృద్ధి మాతోనే కూటమి పాలనలో ఊరూరా కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని అన్నారు.అభివృద్ధితో పాటు సంక్షేమానికి ప్రాధాన్యం చంద్రబాబు నాయుడుకే సాధ్యం అని అన్నారు.ప్రజలకు జరుగుతున్న మంచిని చూసి వైసీపీ ప్రభుత్వం ఓర్వలేక నోరు పారేసుకుంటున్న ఎద్దేవా చేశారు. వెంకటాచలం మండలం చెముడుగుంట పంచాయతీలో రూ.2.32 కోట్లతో పూర్తి చేసిన 12 అభివృద్ధి పనులకు ఎంపీ బీద మస్తాన్ రావుతో కలిసి ప్రారంభోత్సవం చేశారు.ఒకే రోజు 12 అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవంతో చెముడుగుంట గ్రామంలో పండగ వాతారణం నెలకొన్నదని ఆయన అన్నారు. నక్కల కాలనీ గిరిజనవాసులు కోరిన వెంటనె కమ్యూనిటీ హాలు నిర్మాణానికి రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు రూ.30 లక్షలు మంజూరు చేశారని, ఎంపీ నిధులతో నిర్మించిన కమ్యూనిటీ హాలు నక్కల కాలనీ వాసులకు ఉపయోగపడేలా అద్భుతంగా నిర్మాణం జరిగిందని అన్నారు. జాతీయ రహదారి నుంచి బురాన్ పూర్ కు రూ.46 లక్షలతో సిమెంట్ రోడ్డు, రూ.50 లక్షలతో గంగిరెడ్డి చెరువు బ్యూటిఫికేషన్ పనులు జరుగుతున్నాయని,పిల్లలకు పార్కు, వాకింగ్ ట్రాక్ అందుబాటులోకి వచ్చాయి అని అన్నారు. రూ.32 లక్షలతో పంచాయతీ కార్యాలయం కట్టించామని అన్నారు. కుంకుమపూడిలో రూ.26 లక్షలతో సిమెంట్ రోడ్లు వేయించామని అన్నారు. నక్కల కాలనీ నుంచి బుజబుజనెల్లూరు వరకు జెడ్పీ నిధులు రూ.20 లక్షలతో సిమెంట్ రోడ్లు, జాతీయ రహదారి నుంచి బురాన్ పూర్ వరకు చెరువు కట్ట కింద రూ.8.50 లక్షలతో గ్రావెల్ రోడ్డు , కుంకుమపూడి ఎస్సీ కాలనీలోని కమ్యూనిటీ హాలును రూ.5 లక్షలతో మరమ్మతులు చేయించామని అన్నారు.నక్కల కాలనీలో రూ.5 లక్షలతో అంగన్ వాడీ మరమ్మతులు చేయించడంతో పాటు మరో రూ.5 లక్షలతో రచ్చబండ, బురాన్ పూర్ మార్గంలో పైపుకల్వర్టును రూ.5 లక్షలతో వేయించామని అన్నారు. చెముడుగుంటలో ప్రతి నెలా 503 మందికి 21.65 లక్షలు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అందిస్తున్నాం తల్లికి వందనం పథకం కింద 571 మందికి ఏడాదికి రూ.74.23 లక్షలు ఇస్తున్నాం అన్నదాత సుఖీభవ పథకం కింద 132 మంది రైతులు ఏడాదికి రూ.26.40 లక్షలు అందుకుంటున్నారు ఆటోడ్రైవర్లు 42 మందికి రూ.6.30 లక్షలు లబ్ధి చేకూరింది దీపం పథకం కింద 1121 మందికి ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తున్నాం ఒక్క చెముడుగుంట పంచాయతీలోనే రెండున్నరేళ్లలో రూ.2.32 కోట్లతో అభివృద్ధి పనులు చేయడం, కోట్లాది రూపాయలతో సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు లబ్ధి చేకూర్చడం సంతోషంగా ఉంది అంతరాయం లేని విద్యుత్ సరఫరా కోసం విద్యుత్ శాఖ పరిధిలో ట్రాన్స్ ఫార్మర్ల ఏర్పాటు, స్తంభాలకు రూ.30 లక్షలు ఖర్చు చేశారు రూ.44.70 లక్షలతో ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా సోలార్ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నారు ఇప్పుడే కాదు 2014-19 మధ్య కూడా చెముడుగుంట పంచాయతీలో 9.07 కోట్లతో చరిత్రలో నిలిచిపోయేలా అభివృద్ధి