Kaizer News

Markapur: సోమవారం కలెక్టరేట్‌లో ప్రజా పరిష్కార వేద

Markapur: సోమవారం కలెక్టరేట్‌లో ప్రజా పరిష్కార వేదిక నిర్వహణ

· State - Telangana · hmtvlive.com

Shorts మార్కాపూర్: మార్కాపురం జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కార్యక్రమం కొనసాగుతుందని పేర్కొన్నారు. ప్రజలు తమ సమస్యలను స్పష్టంగా అర్జీ రూపంలో రాసుకుని అధికారులకు సమర్పించాలని సూచించారు. ప్రజా సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం పొందేందుకు ఈ వేదిక మంచి అవకాశమని కలెక్టర్ విజయ సునీత తెలిపారు. జిల్లాలోని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News