రేవంత్ నల్లమల పులి కాదు.. బాబు ముందు పిల్లి కృష్ణా జలాలను ఆంధ్రాకు వదిలి పెడుతున్నడు దమ్ముంటే జూరాల ఆయకట్టు ఎండకుండా చూడు పక్క రాష్ట్రంలో మీ కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నది కదా.. ఆల్మట్టి ప్రాజెక్టు నుంచి నీళ్లివ్వాలని వాళ్లకు లేఖ రాయి ఎల్ నినో పేరు చెప్పి రైతులను మోసం చేస్తున్నరు పెబ్బేరు రోడ్‌షోలో నిప్పులు చెరిగిన కేటీఆర్ ఎకరా ఎండినా వదిలిపెట్టం జూరాల ఆయకట్టుకు నీళ్లివ్వాల్సిందే కాంగ్రెస్ సర్కార్‌కు కేటీఆర్ ఘాటు హెచ్చరిక మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ‘రేవంత్‌రెడ్డీ గుర్తుపెట్టుకో.. జూరాల ఆయకట్టు కింద ఒక్క ఎకరా ఎండినా మీ ప్రభుత్వాన్ని వదిలిపెట్టేది లేదని, పరిణామాలు తీవ్రంగా ఉంటాయి’ అని బీఆర్‌ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో హెచ్చరించారు. అవసరమనుకుంటే జూరాల నుంచి చివరి ఆయకట్టు వరకు ఉద్యమిస్తామని, రైతుల పక్షాన నిలబడుతామని తేల్చిచెప్పారు. నీళ్లు ఉన్నా, రైతుల కోసం వదిలిపెట్టాలనే సోయి ముఖ్యమంత్రికి లేదని విమర్శించారు. శనివారం వనపర్తి జిల్లా పెబ్బేరు రోడ్ షోలో ఆయన మాట్లాడుతూ పాలమూరు బిడ్డ అని చెప్పుకొనే రేవంత్‌రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రేవంత్‌రెడ్డి నల్లమల పులి కాదని, చంద్రబాబు ముందు పిల్లి అని, అందుకే కృష్ణా జలాలను ఆంధ్రాకు వదిలి పెడుతున్నాడని మండిపడ్డారు. శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు, వెలిగొండకు బ్రహ్మాండంగా వందల టీఎంసీల నీళ్లను వదిలిపెడుతున్నాడు కానీ పాలమూరుకు మాత్రం నీళ్లు ఇవ్వడం లేదని విమర్శించారు. కరెంట్ కోసం ముఖ్యమంత్రి సొంత ఊరైన కొండారెడ్డిపల్లి రైతులు ధర్నా చేయడం రేవంత్‌రెడ్డికి సిగ్గుచేటని ధ్వజమెత్తారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదని, కాంగ్రెస్ తెచ్చిన కరువు వచ్చింది అంటూ నిప్పులుచెరిగారు. ఈ సర్కార్‌కు యూరియా ఇచ్చే తెలివి లేదు.. రైతుబంధు చేసే తెలివి లేదు.. రుణమాఫీ చేసే తెలివి లేదు.. ఆఖరికి నీళ్లు ఇచ్చే తెలివి కూడా లేదని ఎద్దేవా చేశారు. ‘జూరాల, ఆల్మట్టి, నారాయణపూర్‌లో ఉన్నాయి.. కింద శ్రీశైలంలో ఉన్నాయి.. పక్క రాష్ట్రంలో అధికారంలో ఉన్నది కూడా మీ పార్టీయే కదా! రేవంత్‌రెడ్డీ.. నీకు చేతనైతే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి లేఖ రాయ్.. లేదా మమ్మల్ని పంపు.. మా రైతులకు నీళ్లు విడుదల చేయండి అని అడుగుతాం’ అని చెప్పారు. తమకు రైతు ప్రయోజనం ముఖ్యమని, రాజకీయ ప్రయోజనం కాదని కేటీఆర్ స్పష్టంచేశారు. జూరాల ఆయకట్టు కింద ఉన్న వనపర్తి జిల్లాలో నీళ్లు సరిగ్గా రాక పంటలన్నీ ఆగమైపోతున్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. జూరాలలో మొత్తం కాలమయిన తర్వాత ఇప్పటివరకు కేవలం మొత్తం కలిపి 18 టీఎంసీల నీళ్లు మాత్రమే ఇచ్చారని ధ్వజమెత్తారు. తన గురువు చంద్రబాబు కోసం మాత్రం 100 టీఎంసీలు వదిలిపెడ్తున్నాడని విమర్శించారు. కల్వకుర్తి పంపులు కూడా సరిగ్గా ఆన్ చేయలేదని మండిపడ్డారు. ఐదు పంపులు ఉంటే ఎన్నడూ ఏ ఒక్క రోజు కూడా 3 పంపులు కూడా సరిగ్గా నడుపలేదని ధ్వజమెత్తారు. ఇక కల్వకుర్తి కింద పది టీఎంసీలకు మించి నీళ్లు ఇవ్వలేదని పేర్కొన్నారు. జూరాలలో నీళ్లు ఉన్నా పైనుంచి ఇన్‌ఫ్లో లేక నీళ్లు వదలడం లేదని సీఈ చెప్పారని కేటీఆర