Kaizer News

ది మైక్రో స్పై: సీల్‌ చెక్కుచెదరలేదు.. అయినా లీక్‌

ది మైక్రో స్పై: సీల్‌ చెక్కుచెదరలేదు.. అయినా లీక్‌!

· State - Telangana · sakshi.com

డీజీపీ చాంబర్‌... మేజర్‌ సూరజ్‌ మెహతా మొహంలో ఆందోళన కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఎదురుగా క్రైమ్‌ బ్రాంచ్‌ ఇన్‌స్పెక్టర్‌ అభిమన్యు. ‘దేశ సరిహద్దు రక్షణకు సంబంధించిన అత్యంత రహస్యమైన డ్రోన్‌ ఆటోమేషన్‌ బ్లూప్రింట్స్‌– కీలకమైన డిఫెన్స్‌ డాక్యుమెంట్స్‌ ఉన్న కవరును తీసుకుని ఢిల్లీ నుండి హైదరాబాద్‌ వచ్చారు. మేజర్‌ సూరజ్‌ మెహతా– ఆ పత్రాలను ఐటీ కారిడార్‌లోని డిఫెన్‌ ్స రీసెర్చ్‌ విభాగానికి అందజేయాల్సి ఉంది. ‘మేజర్‌ సూరజ్‌ మెహతా నిన్న రాత్రి బంజారాహిల్స్‌లోని ఒక లగ్జరీ హోటల్‌లో బస చేశారు. రాత్రి ఆయన భద్రంగా దాచుకున్న ఆ రహస్య కవరు ఉదయం చూసేసరికి మాయమైంది. ప్రభుత్వ అధికారిక లక్క ముద్ర ఉన్న ఆ కవరు పోవడం చాలా ప్రమాదకరం...’ డీజీపీ గంభీరంగా చెప్పాడు. ‘అవును మిస్టర్‌ అభిమన్యు! ఎన్‌ ఐఏ, సీబీఐ ఇప్పటికిప్పుడు రంగంలోకి దిగే పరిస్థితి లేదు. చాలా కాన్ఫిడెన్షియల్‌... మీ ప్రతిభ గురించి విన్నాం... మీరే ఈ కేసును సాల్వ్‌ చేయాలి.’ మేజర్‌ మెహతా అన్నాడు. ‘డోంట్‌ వర్రీ... దేశ రక్షణ మన బాధ్యత, మీరు నిశ్చింతగా వుండండి.’ చెప్పి బయటకు నడిచాడు అభిమన్యు. అతడిని అనుసరించాడు మేజర్‌ సూరజ్‌ మెహతా. అభిమన్యు వెంటనే మేజర్‌ సూరజ్‌ మెహతాతో కలిసి హోటల్‌ రూమ్‌ నంబర్‌ 404కి చేరుకున్నాడు. రూమ్‌లో ఎలాంటి గొడవ జరిగిన ఆధారాలు లేవు. లాకర్‌ తాళాలు మేజర్‌ సూరజ్‌ పాకెట్‌లోనే ఉన్నాయి. ‘రాత్రి నేను గది తాళం వేసుకుని పడుకున్నాను. కిటికీలు కూడా లోపలి నుంచే బంధించి ఉన్నాయి. మరి కవరు ఎలా మాయమైంది?’ హోటల్‌లో ఉన్న అన్ని సీసీ కెమెరాలు పరిశీలిస్తున్న అభిమన్యుకు గ్రౌండ్‌ ఫ్లోర్‌లో డస్ట్‌ బిన్లను తీసుకువెళ్తున్న రూమ్‌ బాయ్‌ కనిపించాడు. ఆ డస్ట్‌ బిన్లలో ఉన్న చెత్తను ఇంకా మునిసిపల్‌ వ్యాన్‌లో తరలించలేదు. వెంటనే ఆ చెత్తలో వెతికితే కవర్‌ దొరికింది. ‘కవర్‌ దొరికింది. కానీ డస్ట్‌ బిన్‌లోకి ఎలా వెళ్ళింది?’ తనలో తానే గొణుక్కుంటున్నట్టు అన్నాడు మేజర్‌ సూరజ్‌ ఆ కవర్‌ వంక చూసి. ఇన్‌స్పెక్టర్‌ అభిమన్యు తన ట్రెంచ్‌ కోట్‌ జేబులోంచి భూతద్దం తీసి ఆ కవర్‌ను పరిశీలించాడు. ‘లక్క ముద్ర అలాగే ఉంది కానీ, లోపల ఉన్న దేశ రహస్యాలు ఇప్పటికే లీక్‌ అయిపోయాయి!’ అభిమన్యు అన్నాడు. మేజర్‌ సూరజ్‌ షాకింగ్‌గా చూస్తూ వుండిపోయాడు ‘ ఇప్పుడెలా? అతని గొంతులో ఆందోళన. ‘లీకైన రహస్యాలు బయటకు పొక్కకముందే లాక్‌ అవుతాయి.’ అభిమన్యు చెప్పాడు. అప్పటికే అతని బ్రెయిన్‌ మ్యాప్‌ పనిచేస్తోంది. అభిమన్యు వెంటనే హోటల్‌లో బస చేసిన వారి రికార్డులను పరిశీలించాడు. అదే ఫ్లోర్‌లో ఉన్న ఒక విదేశీ ప్లాస్టిక్‌ సర్జన్‌ ప్రొఫైల్‌ అతని దృష్టికి వచ్చింది. వెంటనే డూప్లికేట్‌ కీతో గది ఓపెన్‌ చేశాడు. ∙∙ ఫెడరిక్‌ మాస్టర్‌ కీతో గది తలుపు తెరిచి షాకయ్యాడు. అతనిలో ఏదో అనుమానం. ‘హలో మిస్టర్‌ ఫ్రెడరిక్‌ అమెరికా ఎఫ్‌బీఐకి కూడా దొరక్కుండా మా దేశానికి ఎందుకు వచ్చావ్‌? ఆ మాటలు విని ఆ స్పై సర్జన్‌ ఫెడరిక్‌ జేబులో నుంచి రివాల్వర్‌ తీయబోయాడు. అప్పటికే అతని వెనుక రివాల్వర్‌తో అభిమన్యు. ∙∙ ‘ఫెడరిక్‌ మిమ్మల్ని ఢిల్లీ నుంచి ఫాలో అవుతూ వచ్చాడు. ఒక ప్రొఫెషనల్‌ మాత్రమే ఇలా చేయగలడు. అతని గురించి ఆరా తీస్తే డొంక కదిలిం

Original source: sakshi.com
Read more on Kaizer News