కొలంబో వేదికగా శ్రీలంకతో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌ను భారత జట్టు డ్రాగా ముగించడంపై టీమ్ ఇండియా మాజీ బ్యాటర్ మహమ్మద్ కైఫ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. ఫాలోఆన్ ఆడుతూ శ్రీలంక యంగ్ ఆల్‌రౌండర్ సొనాల్ దినుష 264 బంతుల్లో అజేయంగా 133 పరుగులు చేసి మ్యాచ్ లో తమ జట్టును ఓటమి నుంచి తప్పించాడు. గాలే టెస్టులోనూ శతకం బాదిన దినుష బ్యాటింగ్‌లో ఉన్న స్పష్టమైన లోపాలను గుర్తించి అతడిని ట్రాప్ చేయడంలో భారత బౌలింగ్ విభాగం, కోచింగ్ స్టాఫ్ పూర్తిగా విఫలమయ్యారని కైఫ్ మండిపడ్డాడు. Read Also: Asian Games Squad: జపాన్ ఏర్పాట్లపై బీసీసీఐ తీవ్ర అసంతృప్తి.. ఏషియన్ గేమ్స్ కు టీమ్ ఇండియా బి టీమ్ పంపే ఆలోచనలో బోర్డు! ఇంతమంది కోచ్ లున్నా.. తాజాగా జరిగిన ఓ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న కైఫ్, భారత వ్యూహాలను ప్రశ్నించాడు. "ప్రతి బ్యాటర్‌కు ఎక్కడో ఒక బలహీనత ఉంటుంది. దాన్ని బౌలర్లు, కోచ్‌లు పసిగట్టాలి. నేను ఒక్క గిల్ గురించి మాట్లాడటం లేదు, మొత్తం బౌలింగ్ యూనిట్, కోచింగ్ స్టాఫ్ గురించే చెబుతున్నా. గాలేలో సెంచరీ చేసిన దినుషను ఇక్కడ ఎలా అవుట్ చేయాలో ప్లాన్ చేయాల్సింది. కానీ ఇండియా చాలా తక్కువగా ఎటాక్ చేసింది. ఫీల్డింగ్ ఓపెన్ చేసి సులువుగా సింగిల్స్ ఇచ్చారు. అతడికి డ్రైవ్ బాల్స్ వేసి ఊరించలేదు. డ్రైవ్ ఆడటం దినుషకు ఏమాత్రం ఇష్టం ఉండదు. మహమ్మద్ సిరాజ్ ఫుల్ లెంగ్త్ బాల్ వేసినప్పుడు అతడు దాన్ని వదిలేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో సారాంశ్ జైన్ కూడా ఫుల్ డెలివరీతోనే అతడిని అవుట్ చేశాడు. ఇండియా లాంటి పెద్ద జట్టులో వీడియో అనలిస్ట్, స్టాట్స్ పర్సన్, ఏడెనిమిది మంది కోచ్‌లు ఉన్నారు. ఇదొక క్లబ్ మ్యాచ్ కాదు కదా ఆలస్యంగా మేల్కోవడానికి" అని కైఫ్ అసంతృప్తి వ్యక్తం చేశాడు.. Read Also: Praggnanandhaa Record: ప్రజ్ఞానంద కొత్త చరిత్ర! గ్రాండ్ చెస్ టూర్ గెలిచిన తొలి భారతీయుడిగా రికార్డు! ఆ అనుభవం లేకపోవడంతోనే.. భారత యువ బౌలర్లకు ఐదో రోజు పిచ్‌లపై ఆడిన అనుభవం లేకపోవడం కూడా ఫలితాన్ని దెబ్బతీసిందని కైఫ్ విశ్లేషించాడు. "ప్రస్తుత తరం యువ బౌలర్లు ఐదో రోజు పిచ్‌లపై చాలా అరుదుగా బౌలింగ్ చేస్తున్నారు. ఈ రోజుల్లో టెస్ట్ మ్యాచ్‌లు అంత సుదీర్ఘంగా సాగడం లేదు. అందుకే ఇలాంటి ఫ్లాట్ వికెట్లపై బ్యాటర్లను ఎలా కట్టడి చేయాలో వారికి సరిగ్గా అర్థం కావడం లేదు. పైగా దినుష బ్యాటింగ్‌ను మనవాళ్లు గతంలో ఎప్పుడూ చూడలేదు. ఉదాహరణకు జో రూట్ లాంటి స్టార్ బ్యాటర్ అయితే రవీంద్ర జడేజా అతడికి ఎన్నోసార్లు బౌలింగ్ చేశాడు కాబట్టి పక్కా ప్లాన్ రెడీ చేయొచ్చు. కానీ కొత్త బ్యాటర్‌ను అంచనా వేయడంలో మనవాళ్లు తడబడ్డారు" అని పేర్కొన్నాడు.. త్వరగా ఆలౌట్ చేయకపోవడంతోనే.. భారత జట్టు గాలేలో జరిగిన మొదటి టెస్టులో 165 పరుగులతో గెలిచినా, కొలంబోలో లంక బ్యాటర్లను త్వరగా ఆలౌట్ చేయలేక మ్యాచ్‌ను డ్రాగా ముగించింది. గెలవాల్సిన మ్యాచ్ డ్రా కావడంతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ రేసులో కీలకమైన పాయింట్లను కోల్పోవాల్సి వచ్చింది. రెండు టెస్టుల సిరీస్ ను 1-0తో సొంతం చేసుకుంది. (IST) Tags : Shubman Gill IND Vs SL Mohammad Kaif Saransh Jain Colombo Test Sonal Dinusha Colombo T