Kaizer News

రోడ్డు సమస్యను పరిష్కరిస్తాం

· State - Telangana · sakshi.com

మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రాధిక మెదక్‌ కలెక్టరేట్‌: రెండు రోజుల్లో రోడ్డు సమస్యను పరిష్కరిస్తామని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రాధిక హామీ ఇచ్చారు. పట్టణంలోని సాయిదత్తా థియేటర్‌ వద్ద గత రెండు నెలలుగా రోడ్డు నిర్మాణ పనులు సాగుతుండటంతో సాయినగర్‌ కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఆదివారం స్థానిక కౌన్సిలర్‌తో పాటు మాజీ కౌన్సిలర్‌ సమీ యొద్దీన్‌, స్థానిక ప్రజలు సమస్యను చైర్‌పర్సన్‌ దృష్టికి తీసుకెళ్లగా ఆమె పరిశీలించారు. వెంటనే ఆర్‌అండ్‌బీ అధికారులతో ఫోన్‌ ద్వారా మా ట్లాడి వెంటనే రోడ్డు సమస్య పరిష్కరించాలన్నారు. అలాగే ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌రావు దృష్టికి తీసుకెళ్లి సమస్య త్వరగా పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఆమె వెంట కాంగ్రెస్‌ నాయకుడు భూపతిరాజ్‌ తదితరులు ఉన్నారు. ‘ధర్మస్థల నియోజకవర్గం’ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు) ‘రోమాంచకం’ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌...ముఖ్య అతిథిగా విజయ్‌ దేవరకొండ (ఫొటోలు) నల్గొండ జిల్లాలో ఘనంగా శ్రావణ మాసం బోనాలు (ఫొటోలు) ABN రాధాకృష్ణని ఒక్కటే అడుగుతున్నా జోగి రమేష్ ఫైర్ నీకు టైం దగ్గర పడింది సాయిరెడ్డి... ఎవరిని చూసి రెచ్చిపోతున్నావో మాకు తెలుసు! సీఎం విజయ్ సంచలన నిర్ణయం.. DMK స్టాలిన్ కు షాక్

Original source: sakshi.com
Read more on Kaizer News