Kaizer News

లావా నుంచి బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్.. 6000m

లావా నుంచి బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్.. 6000mAh బ్యాటరీ, 50MP AI కెమెరా స్మార్ట్ ఫోన్ ఇంత తక్కువకా..!

· State - Telangana · v6velugu.com

లావా (LAVA) నుంచి మరో బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్ వచ్చేసింది. లావా బోల్డ్ N4 ప్రో 5Gని అధికారికంగా విడుదల చేసింది. దీంతో.. లావా తన స్మార్ట్‌ఫోన్ మార్కెట్ను మరింత విస్తరించింది. బ్యాటరీ బ్యాకప్, కెమెరా ఈ స్మార్ట్ ఫోన్లో హైలైట్స్. 6000mAh సామర్థ్యం ఉన్న బ్యాటరీతో 50MP AI ప్రైమరీ కెమెరాతో లావా బోల్డ్ N4 ప్రో 5జీ అందుబాటులోకి వచ్చింది. 120Hz రిఫ్రెష్ రేట్, వాటర్‌డ్రాప్ నాచ్‌తో కూడిన 6.75-అంగుళాల డిస్‌ప్లే.. IP64 స్ప్లాష్, డస్ట్ రెసిస్టెన్స్ రేటింగ్ ఇతర ఫీచర్లు. ఆక్టా-కోర్ 5G చిప్‌సెట్‌తో పనిచేసే ఈ స్మార్ట్ ఫోన్, మల్టీటాస్కింగ్‌ను హ్యాండిల్ చేయగలిగేలా వర్చువల్ ర్యామ్, ఇంటర్నల్ స్టోరేజ్ Expand చేసుకునేలా రూపొందింది. లావా బోల్డ్ N4 ప్రో 5G స్పెసిఫికేషన్లు * 6.75-అంగుళాల (1612 × 720 పిక్సెల్స్) HD+ LCD స్క్రీన్, 120Hz రిఫ్రెష్ రేట్ * 6GB LPDDR4x RAM, 128GB UFS 2.2 ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రో SDతో 1TB వరకు మెమరీని విస్తరించుకోవచ్చు * ఆండ్రాయిడ్ 16 * హైబ్రిడ్ డ్యూయల్ సిమ్ (నానో + నానో / మైక్రోఎస్డీ) * 50MP బ్యాక్ కెమెరా, LED ఫ్లాష్, 2k వీడియో రికార్డింగ్ * 8MP ఫ్రంట్-ఫేసింగ్ కెమెరా * సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ * బరువు: 207గ్రాములు * USB టైప్-సి,18W ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 6000mAh బ్యాటరీ లావా బోల్డ్ N4 ప్రో 5G మిడ్‌నైట్ బ్లూ, లేత లావెండర్/సిల్వర్ గ్రేడియంట్ రంగులలో అందుబాటులో ఉంది. 6GB + 128GB సింగిల్ వెర్షన్ ధర రూ. 13,999గా ఉంది. సెప్టెంబర్ 26 మధ్యాహ్నం 12:00 గంటల (IST) నుంచి మన దేశంలో అమెజాన్లో అందుబాటులో ఉంటుంది. ►

Original source: v6velugu.com
Read more on Kaizer News