రుద్రూర్: పొతంగల్ మండల గ్రామ పంచా యతీ కార్యదర్శుల సంఘం నూతన కార్యవర్గాన్ని శనివారం ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా పీ ప్రతాప్, ఉపాధ్యక్షుడిగా కే వెంకటేశ్వర్‌గౌడ్, ప్రధాన కార్యదర్శిగా బీ ప్రియాంక, కోశాధికారిగా ఏ రాజు, గౌరవ అధ్యక్షుడిగా ఎం క్యాకప్ప ఎన్నికయ్యారు. ఆర్మూర్‌టౌన్: ఆర్మూర్ ఆల్ టూ వీలర్స్ మె కా నిక్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా నియామకమైన బీజేపీ ఆర్మూర్ పట్టణ కార్యదర్శి, స్వాభిమాన్ ఆత్మీయ మిత్ర మండలి సభ్యుడు దక్షిణామూర్తికి స్వాభిమాన్ ఆత్మీయ మిత్రమండలి సభ్యులు అభినందించారు. కార్యక్రమంలో జెస్సు అనిల్ కుమార్, ద్యాగ ఉదయ్, విజయానంద్, దొండి ప్రకాశ్, పులి యుగంధర్, కలిగోట ప్రశాంత్, ఉదయ్ గౌడ్, వంశీ తదితరులు పాల్గొన్నారు. పెర్కిట్: మధ్యాహ్నా భోజన బిల్లులను ప్రభు త్వం వెంటనే విడుదల చేయాలని రైతు సంఘం జిల్లా కార్యదర్శి పల్లపు వెంకటేశ్ డిమాండ్ చేశారు. ఆర్మూర్ పట్టణ కేంద్రంలో ఆర్మూర్ డివిజన్ మధ్యాహ్న భోజన కార్మికుల జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. పెండింగ్‌లో ఉన్న బిల్లులను వెంటనే విడుదల చేసి బియ్య ముతో పాటు కూరగాయలు, నూనె, కోడిగుడ్లు ప్రభుత్వమే సరఫరా చేయాలని కోరారు. అ నంతరం మధ్యాహ్న భోజన కార్మిక సంఘం(సీఐటీయూ)ఆర్మూర్ ఏరియా నూతన కమిటీ ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా పల్లపు వెంకటేశ్, ఏరియా కార్యదర్శిగా సుజాత, ఉపాధ్యక్షులు గా స్వరూప, సహాయ కార్యదర్శిగా ప్రమీల, కోశాధికారిగా దయమణి ఎన్నికయ్యారు. కా ర్యక్రమంలో నాయకులు సుశీల, దేవాయి, స మీనా, అలేమా, భవిత పాల్గొన్నారు బోధన్: రాఖీ పండుగను పురస్కరించుకుని ప్ర యాణికుల సౌకర్యార్థం ఈ నెల 31న బోధన్ ఆర్టీసీ డిపో నుంచి ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు డీఎం విశ్వనాథ్ శనివారం ఒక ప్ర కటనలో తెలిపారు. ఆ ఒక్క రోజు మాత్రమే ప్రత్యేక బస్సుల్లో ప్రయాణించే వారు అదనపు చార్జీలు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ముందస్తు సీట్ల కోసం రిజర్వేషన్ చేసుకునే సౌకర్యం ఉందన్నారు. బోధన్ డిపో నుంచి నిజామాబాద్ నగర కేంద్రంతో పాటు జేబీఎస్, వరంగల్ రూట్లో, తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలకు ప్రత్యేక బస్సులను నడుపుతామన్నారు. రెంజల్: నిబంధనలకు విరుద్ధంగా వైన్స్‌లు ని ర్వహిస్తున్నట్లు ఫిర్యాదు చేసి నెల రోజులు గడుస్తున్నా సంబంధిత ఎకై ్సజ్ పోలీసులు పట్టించుకోవడం లేదని తెలంగాణ రక్షణ సేన సాటా పూర్ గ్రామ ప్రతినిధులు ఆరోపించారు. శనివారం స్థానిక విలేకరులతో వారు మాట్లాడా రు. మండలంలోని సాటాపూర్‌లో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న వైన్స్‌లపై ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదన్నా రు. వైన్స్ పక్కనే మైసమ్మ గుడి ఉందని అ క్కడికి వచ్చే భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. అధికారులు విచారణ చే పట్టి చర్యలు తీసుకువాలని కోరారు. బోధన్: సాలూర మాజీ సర్పంచ్ ఇల్తెపు సాయన్న (94) అనారోగ్యంతో శుక్రవారం అర్ధరాత్రి కన్ను మూశారు. ఆయన హ యాంలో అనేక అభివృద్ధి పనులు చేపట్టి ప్రజల మ న్ననలు పొందారు. శనివారం స్వగ్రామంలో ఆ యన అంత్యక్రియలు జరిగాయి. ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నేతలు సాయన్న పార్థివ దేహాన్ని సందర్శించి నివాళు