Kaizer News

నిఠారీ హత్యల కేసు నిర్దోషి ఆత్మహత్య

నిఠారీ హత్యల కేసు నిర్దోషి ఆత్మహత్య

· National - India · ntnews.com

హరిద్వార్‌ : నిఠారీ హత్యల కేసులో నిర్దోషిగా జైలు నుంచి విడుదలైన సురేంద్ర కోలి శుక్రవారం హరిద్వార్‌లో ఆత్మహత్య చేసుకొన్నాడు. నాలుగు రోజుల క్రితం తాను అద్దెకు తీసుకొన్న టీ స్టాల్‌లో అతడు ఉరేసుకొన్నాడు. 2025 నవంబర్‌లో అతడిపై నమోదైన చివరిదైన 13వ కేసులో కోలిని సుప్రీం కోర్టుగా నిర్దోషిగా ప్రకటించి విడుదల చేసింది. నోయిడాలోని నిఠారీ ప్రాంతంలో 2005-06 మధ్య కాలంలో జరిగిన హత్యలు సంచలనం సృష్టించాయి. ఓ బంగ్లా వెనుక ఉండే డ్రైన్‌లో మనుషుల పుర్రెలు, ఎముకలు, దుస్తులు లభించాయి. ఆ హత్యలు జరిగిన బంగ్లా యజమాని మోహిందర్‌ సింగ్‌ వద్ద కోలి సహాయకుడిగా పనిచేసేవాడు. కుంభమేళా ఏర్పాట్ల కోసం అధికారులు ఇటీవల చేపట్టిన కబ్జాల నిరోధక డ్రైవ్‌లో తాను అడ్వాన్స్‌ చెల్లించిన టీ స్టాల్‌ను తొలగిస్తారేమోనని కోలి భయపడి ఉంటాడని స్థానికులు తెలిపారు

Original source: ntnews.com
Read more on Kaizer News